బికినీ బ్యూటీ అంటే ముందుగా గుర్తొచ్చేది ముద్దుగుమ్మ అమీజాక్సనే. సోషల్ మీడియాలో బికినీ ఫోటోలతో పిచ్చెక్కించేస్తూ ఉంటుంది ఈ సో హాట్ సుందరి. అయితే ఈ బ్యూటీ ఇప్పుడు హాట్ హాట్ ఆఫర్‌ని దక్కించుకుందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. అదేంటంటే, మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న 'సైర నరసింహారెడ్డి' సినిమాలో ఓ పాత్ర కోసం ఈ బ్రిటీష్ బ్యూటీని ఎంచుకున్నారనీ తాజా గాసిప్.
ఈ సినిమా తొలి తెలుగు స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోంది. బ్రిటీష్ పాలనకు సంబంధించిన అంశాలు, పాత్రలు ఈ సినిమాలో చాలా కీలకం. ఆ దిశగా, ఓ బ్రిటీష్ యువతి పాత్ర కోసం హాట్ బ్యూటీ అమీజాక్సన్‌ని ఎంచుకున్నారనీ తెలుస్తోంది. స్వతహాగా బ్రిటీష్ యువతే కావడం అమీజాక్సన్‌కి ప్లస్ పాయింట్. ఆమె ముఖంలో ఆ ఫ్లేవర్ ఎక్కువగా కనిపిస్తుంది. గతంలో ఓ తమిళ సినిమాలో బ్రిటిష్ యువరాణి పాత్రలో ఆమె కనిపించింది కూడా. అందుకే నేచురాలిటీ కోసం ఏరి కోరి ఆ పాత్రకి ఈ ముద్దుగుమ్మని ఎంచుకున్నారంటూ గాసిప్స్ వినవస్తున్నాయి.
తెలుగులో ఈ ముద్దుగుమ్మ స్ట్రెయిట్‌గా ఒకే ఒక్క సినిమాలో నటించింది. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కిన 'ఎవడు' చిత్రమది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రలో అమీజాక్సన్ నటించింది. చరణ్‌తో హాట్ హాట్ సాంగ్‌లో చిందేసింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం 'రోబో 2.0' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.