ఈమధ్య సోషల్ మీడియాలో ఓ పెళ్లి వార్త షికారు చేస్తోంది. అది నటి సురేఖా వాణి గురించి. సురేఖా వాణి త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతోందని, ముహుర్తాలు కూడా ఖరారు అయిపోయాయన్నది ఆ వార్తల సారాంశం. ఇటీవల.. గాయని సునీత రెండో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి మీడియాలో మంచి కవరేజ్ కూడా వచ్చింది. సునీత బాటలోనే సురేఖా వాణి నడుస్తోందని, రెండో పెళ్లి కబురు త్వరలోనే వినిపించబోతోందని సోషల్ మీడియా రాతగాళ్లు తేల్చేశారు. సురేఖావాణి భర్త రెండేళ్ల క్రితమే మరణించారు. దాంతో.. ఈ పెళ్లి వార్త నిజమే అనుకున్నారంతా.
దీనిపై సురేఖ క్లారిటీ ఇచ్చేసింది. రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, తన జీవితంలో మరో పెళ్లి ప్రస్తావనే లేదని, ప్రస్తుతం తాను సంతోషంగా ఉన్నానని... ఓ లేఖ విడుదల చేసింది. దాంతో... సురేఖ పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. నిజానికి సురేఖపై ఇది వరకు కూడా ఇలాంటి గాసిప్పులు చాలా వచ్చాయి.కానీ అప్పుడు సురేఖ లైట్ తీసుకుంది. ఇది పెళ్లి మేటరు కాబట్టి.. ఈ పుకార్లకు పుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకుని.. ఇలా బయటకు వచ్చింది.