సైరా తరవాత మరో సినిమాని పట్టాలెక్కించలేదు సురేందర్‌రెడ్డి. ఆయనముందు నుంచీ స్లో అండ్ స్టడీ.. టైపే. అయితే ఇప్పుడు మాత్రం వరుసగా రెండు సినిమాల్ని ఓకే చేసేశారు. అఖిల్ తో సురేందర్ రెడ్డి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పూర్తయిన వెంటనే.. నితిన్ తో ఓ సినిమా చేస్తారు. ప్రస్తుతం నితిన్ కథ రెడీ అయిపోయిందని తెలుస్తోంది.
`కిక్` టైపులోనే కమర్షియల్ గా ఉంటూ, ఓ కొత్త పాయింట్ చెప్పబోతున్నార్ట. ఈ కథ విని.. నితిన్ బాగా ఎగ్జైట్ అయ్యాడని, వెంటనే ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఠాగూర్ మధు ఈ చిత్రానికి నిర్మాత. ప్రస్తుతం రంగ్ దే, చెక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు నితిన్. 2022లో ఈ కాంబో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ యేడాది ఫిబ్రవరి లేదా మార్చి లో.. అఖిల్ -సురేందర్ రెడ్డి ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్తుంది.