పవన్ కల్యాణ్ జోరు మామూలుగా లేదు. వకీల్ సాబ్ షూటింగ్ ని ఇటీవలే పూర్తి చేసిన పవన్.... క్రిష్ సినిమా షూటింగ్ మొదలెట్టేసిన సంగతి తెలిసిందే. అయ్యప్పయుమ్ కోషియమ్ రీమేక్ కీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. త్వరలోనే.. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. మరోవైపు.. హరీష్ శంకర్ పవన్ కోసం ఓ పవర్ ఫుల్ స్క్రిప్టుని రెడీ చేస్తున్నాడు. ఇప్పుడు సురేందర్‌రెడ్డి వంతు వచ్చింది.
పవన్ కల్యాణ్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోంది. ఎస్.ఆర్.టీ సంస్థ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవలే సురేందర్ రెడ్డి పవన్ ని కలిశాడు. వీరిద్దరి మధ్య కథకు సంబంధించిన చర్చలు జరిగాయి. సూరి చెప్పిన కథకి పవన్ పచ్చజెండా ఊపేశాడు. ప్రస్తుతం అఖిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు సూరి. ఆ వెంటనే.. పవన్ తో సినిమా ఉండబోతోంది. ఈలోగా పవన్ మిగిలిన సినిమాల్ని పూర్తి చేసుకోవాలి. 2022లో సురేందర్ రెడ్డి సినిమా పట్టాలెక్కొచ్చు.