సూర్య కథానాయకుడిగా నటించిన చిత్రం `ఆకాశం నీ హద్దురా`. సుధా కొంగర దర్శకత్వం వహించారు. మోహన్ బాబు కీలక పాత్రధారి. ఎప్పుడో విడుదలకు సిద్ధమైంది. కానీ. థియేటర్లు లేకపోవడం వల్ల, విడుదల కాలేదు. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమా హక్కుల్ని అమేజాన్ ప్రైమ్ భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసింది. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కింది.
ఈ చిత్రాన్ని అమేజాన్ లో అక్టోబరు 30న స్ట్రీమింగ్ కి ఉంచబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఎయిర్ డక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. దాదాపు 30 కోట్లకు ఈ సినిమాని అమేజాన్ కొనుగోలు చేసిందని సమాచారం.