లండన్‌లో సందడి చేస్తున్న 'సూర్య' అండ్‌ టీమ్‌

By iQlikMovies - June 26, 2018 - 16:11 PM IST

మరిన్ని వార్తలు

సూర్య హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం నేడు లాంఛనంగా ప్రారంభమైంది. లండన్‌లో ఈ చిత్రం షూటింగ్‌ మొదలైంది. సూర్యతో పాటు, ప్రముఖ మలయాళ హీరో మోహన్‌లాల్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

మోహన్‌లాల్‌తో పాటు, తెలుగు యంగ్‌ హీరో అల్లు శిరీష్‌ మరో ఇంపార్టెంట్‌ రోల్‌లో నటిస్తున్నాడు. క్లుప్తంగా చెప్పాలంటే ఇదో డిఫరెంట్‌ మల్టీస్టారర్‌ సినిమా అని చెప్పొచ్చు. అఖిల్‌ బ్యూటీ సాయేషా సైగల్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. కేవీ ఆనంద్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

'సింగం' సిరీస్‌తో సూర్య తెలుగులో సరికొత్త బ్రాండ్‌ సృష్టించాడు. మోహన్‌లాల్‌ ఈ మధ్య తెలుగులో 'జనతా గ్యారేజ్‌' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అల్లు వారబ్బాయి శిరీష్‌ యంగ్‌ హీరోల్లో తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నాడు. ఇలా భిన్నమైన ముగ్గురు హీరోలు స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఒకింత విచిత్రంగా ఉన్నప్పటికీ, ఈ సినిమా కాన్సెప్ట్‌ని బట్టి, డైరెక్టర్‌ ఈ ముగ్గురు హీరోల్నీ ఒకే స్క్రీన్‌పై కలిపే సాహసం చేశారట. 

అల్లు శిరీష్‌ ఈ సినిమాలో విలన్‌ పాత్ర పోషిస్తున్నాడంటూ ప్రచారం జరిగింది. ఆ వార్తలో ఎంతమాత్రమూ నిజం లేదని శిరీష్‌ కొట్టిపారేశాడు. అయితే ఈ సినిమాలో ఈ ముగ్గురి క్యారెక్టర్స్‌ ఎలా ఉండబోతున్నాయనే దానిపై సర్వత్రా ఆశక్తి నెలకొంది. చూడాలి మరి, ఈ మల్టీ స్టారర్‌ అసలు కథా కమామిషు ఏంటో.!
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS