గతవారం బిగ్ బాస్ హౌస్ లో చాలా ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి, అందులో ముఖ్యంగా కౌశల్ ని టార్గెట్ చేస్తూ కిరీటి చేసిన పని బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారికి కాని బయట చూస్తున్న ప్రేక్షకులకి కాని నచ్చలేదు. ఒకరకంగా కౌశల్ పైన అలా చేయడం వల్ల ప్రేక్షకుల్లో ఆయన పట్ల సానుభూతి పెరిగి ఎక్కువ ఓట్లు వేశారు.
ఈ తరుణంలో కౌశల్ భార్య నీలిమ తన భర్త పైన హౌస్ లో జరిగిన దాని పైన స్పందించింది. సోషల్ మీడియా ద్వారా ఈ మొత్తందాని పైన ఆమె తన అభిప్రాయం చెప్పింది. తన భర్త పైన తనకి పూర్తీ నమ్మకం ఉందని, కావాలనే తన భర్త ని ముందు నుండి టార్గెట్ చేస్తూ ఇంటిలోని సభ్యులందరూ వేరుగా చూస్తున్నారు అని దీప్తి సునైనా విషయంలో కూడా అనవసర రాద్ధాంతం చేశారు అని చెప్పింది.
అయితే తనని అంతమంది టార్గెట్ చేసినా సరే సంయమనం పాటించి టాస్క్ పూర్తీ చేసిన విధానం తనకి సంతృప్తినిచ్చింది అని చెప్పుకొచ్చింది. తన భర్త తప్పు లేనందునే ఆయనకి అందరినుండి మద్దతు లభించి హౌస్ లో ఉండగలిగాడు అన్న అభిప్రాయం వెలిబుచ్చింది.
చివరగా కౌశల్ లాంటి భర్త దొరకడం తనకు గర్వంగా ఉంది అని ముగించింది. మరి ఈ వారంలో కౌశల్ హౌస్ లో ఎలా ఉంటాడు? ఆయనతో మిగతావారు ఎలా ఉంటారు? అనేది చూడాలి.