సూర్య, యశ్ కాంబో లో క్రేజీ మల్టీ స్టారర్

మరిన్ని వార్తలు

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ ఎల్లలు చెరిపేసింది. సౌత్, నార్త్ అన్న తార తమ్యాలు వదిలేసి అన్ని భాషల స్టార్స్ కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే బాహుబలి మూవీ ప్రభాస్, రానాతో తెరకెక్కించి రాజమౌళి భేష్ అనిపించుకున్నారు. నెక్స్ట్ RRR లో చరణ్ , ఎన్టీఆర్ లాంటి గ్లోబల్ స్టార్స్ తో మూవీ తీసి తిరుగులేదనిపించుకున్నాడు. దీనితో సౌత్ లో మరికొన్ని మల్టీస్టారర్ లు రెడీ అవుతున్నాయి. బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ వార్ 2  లో హృతిక్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్  షేర్ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ దేవర లో బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా,  సైఫ్ ఆలీఖాన్ విలన్ గా మెప్పిస్తున్నారు.  


బాలీవుడ్ లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణంలో రణభీర్ కపూర్ రాముడి పాత్రలో, కన్నడ స్టార్ యశ్ రావణుడిగా, మలయాళ హీరోయిన్ సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. ఇలా ప్రతి సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతూ అన్ని భాషలకి చెందిన నటీ నటులు మమేక మవుతున్నారు.  కన్నడ హిట్ మూవీ 'కాంతారా కి సీక్వెల్గా వస్తున్న కాంతారా ప్రీక్వెల్ లో  లో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్నారు.  రజనీ కాంత్ జైలర్ లో అన్ని భాషలకి చెందిన సూపర్  స్టార్స్ కనిపించి అలరించారు. ప్రభాస్ సలార్ లో బాలీవుడ్ , కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్, వారంతా ఉన్నారు.  రానున్న కల్కి మూవీలో కూడా అమితాబ్ , కమల్ హాసన్, మొదలైన పరభాషా నటులు ఉన్నారు. అదే దారిలో ఇప్పుడు మరి కొన్ని మల్టీ స్టారర్ సినిమాలు రానున్నాయి. 


ఇందులో ఆసక్తికర కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, కన్నడ స్టార్ యశ్ లతో  కలిసి ఒక సినిమా చేయాలని కోలీవుడ్ ప్రొడ్యూసర్ కె ఈ జ్ఞానవేల్ గట్టిగా ట్రై చేస్తున్నాడని టాక్. ముందు వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయితే అప్పుడు దర్శకుడిని ఫిక్స్ చేస్తాడని సమాచారం. కోలీవుడ్ దర్శకుడితో ప్లాన్ చేస్తాడా? లేదా టాలీవుడ్ లో ఉన్న పాన్ ఇండియా దర్శకులకి ఈ అవకాశం దక్కుతుందో చూడాలి. ఇది నిజమో కాదో తెలియదు కానీ ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS