తమిళ సూపర్ స్టార్ 'సూర్య' సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళం లో ఉన్న టాప్ హీరోస్ లిస్ట్ లో సూర్య ఒకరు. సూర్య సినిమా అంటే అక్కడ ఎంత క్రేజ్ ఉంటుందో తెలుగులో కూడా ఇంచు మించు అలాగే ఉంటుంది. కాకపోతే ఇక పై థియేటర్స్ లో సూర్య సినిమాలు చూడలేమట. అందుకు కారణం ఎవరో కాదు తన సతీమణి 'జ్యోతిక' తాజా చిత్రమే.
జ్యోతిక నటించిన 'పొన్ మగళ్ వందాల్' చిత్రం సూర్య సొంత సంస్థ '2డి ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ లో నిర్మించబడింది. అయితే, కరోనా లాక్ డౌన్ కారణంగా సూర్య ఈ చిత్రాన్ని థియేటర్స్ లో కాకుండా నేరుగా 'ఓటిటి' దిగ్గజం 'అమెజాన్ ప్రైమ్' లో విడుదల చేశారు. దీనికి 'తమిళనాడు థియేటర్ అసోసియేషన్' తీవ్రంగా ఖండించింది. థియేటర్ కోసం నిర్మించిన చిత్రాలు, మొదట థియేటర్స్ లోనే విడుదల కావాలని.. ఆలా కాకుండా నేరుగా ఆన్ లైన్ లో విడుదల చేయడం సరి కాదని.. ఇక పై హీరో సూర్యకు సంబంధించిన సినిమాలు తమిళనాడు థియేటర్స్ లో బాన్ చేస్తున్నట్టు, తన తాజా చిత్రం 'సూరారై పోట్రు' (ఆకాశమే నీ హద్దురా) నుంచే ఇది మొదలవుతుందని.. తమిళనాడు థియేటర్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ 'పన్నీర్ సెల్వం' ప్రకటించారు.