వన్‌ అండ్‌ ఓన్లీ సూపర్‌స్టార్‌ రజనీ - సూర్య

మరిన్ని వార్తలు

ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా 'రోబో 2.0' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రాత్రి నుండే కోలీవుడ్‌లో సోషల్‌ మీడియా పోటెత్తింది. లక్షల కొద్దీ ట్వీట్లు ముంచెత్తాయి. ఫస్ట్‌ రివ్యూ ఉమైర్‌ సందూ నుండి వచ్చింది. మామూలుగా అర్ధరాత్రి 12 నుండే రివ్యూలు స్టార్ట్‌ అవుతాయి. అలాంటిది అంతకన్నా ముందే ఇక్కడ ఫేక్‌ రివ్యూలు హల్‌చల్‌ చేశాయి. తెల్లవారుజామున 3 గంటల నుండి అసలు రివ్యూలు స్టార్ట్‌ అయ్యాయి. టాలీవుడ్‌ నుండి పలువురు ప్రముఖ హీరోలు 'రోబో 2.0' సపోర్ట్‌గా నిలిచారు.

కోలీవుడ్‌ నుండి విజయ్‌, సూర్య, అజిత్‌ తదితర అగ్ర హీరోలతో పాటు చిన్న హీరోలు కూడా మద్దతిచ్చారు. ముఖ్యంగా తమిళ అగ్రహీరోల్లో ఒకరైన సూర్య, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ని ప్రశంసలతో ముంచెత్తేస్తున్నారు. వన్‌ అండ్‌ ఓన్లీ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ .. ఆయనకెవరూ సాటి రారు అంటూ ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ విజువల్‌ అద్భుతాన్ని ఫస్ట్‌డే ఫస్ట్‌ షో చూడాలని సామాన్య అభిమానులతో పాటు, సినీ ప్రముఖులు కూడా వెయిట్‌ చేస్తున్నారు.

అలా ఆ అవకాశాన్ని మిస్‌ చేసుకున్న వాళ్లు మాత్రం తెగ ఫీలైపోతున్నారు. నేచురల్‌ స్టార్‌ నాని 'సూపర్‌స్టార్‌ '2.0' బాక్సాఫీస్‌కి చేరుకుంది. నేను షూటింగ్‌ స్పాట్‌కి చేరుకున్నా.. ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో మిస్సవుతున్నా..' అని ట్వీట్‌ చేశారు. ఇలా పలువురు సినీ ప్రముఖులు '2.0'కి తమ తమ ట్వీట్స్‌తో సోషల్‌ మీడియాని నిండబెట్టేశారు


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS