అక్షయ్ కుమార్ నటించిన హర్రర్ కామెడీ సినిమా `లక్ష్మీ బాంబ్` విడుదలకు సిద్ధమైంది. నవంబరు 9న ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుంది. ట్రైలర్ చూస్తుంటే.. తప్పకుండా ఈ సినిమా విజయవంతం అవుతుందనే అనిపిస్తోంది. లారెన్స్ రాఘవ తెరకెక్కించిన `కాంచన`కి రీమేక్ ఇది. దక్షిణాదిన `కాంచన`కు మంచి వసూళ్లు దక్కాయి. ఇప్పుడు హిందీలోనూ.. ఇలాంటి స్పందనే వస్తుందని ఆశిస్తున్నారంతా.
అయితే ఈ సినిమాపై ఇప్పుడు ఓ బాంబు పడింది. `లక్ష్మీబాంబ్`ని బాయ్ కాట్ చేయాలన్న సుశాంత్ సింగ్ రాజ్పుత్ అభిమానులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. సుశాంత్ ఘటనలో న్యాయం కోసం చేసిన పోరాటానికి అక్షయ్ మద్దతు ఇవ్వలేదని, అలాంటి కథానాయకుల సినిమాల్ని చూడొద్దని సుశాంత్ అభిమానులు చెబుతున్నారు. ఇది వరకు `సడక్` సినిమాపై కూడా ఇలానే నిరసన తెలియజేశారు. ఆ సినిమాకి సరైన వ్యూవర్ షిప్ లభించలేదు. సరికదా.. నెగిటీవ్ రివ్యూలు ఆ సినిమా కొంప ముంచాయి. సరిగ్గా అదే ప్రమాదం లక్ష్మీబాంబ్ కీ పొంచి వుంది.