స్టైలిష్‌ స్టార్‌తో అక్కినేని మేనల్లుడు!

By iQlikMovies - June 07, 2019 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమాకి సంబంధించి స్పెషల్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాలో ఇంకో యంగ్‌ హీరో నటించబోతున్నాడు. ఆయన మరెవరో కాదు, అక్కినేని మేనల్లుడు సుశాంత్‌. ఈ విషయాన్ని స్వయంగా సుశాంత్‌ ట్విట్టర్‌ ద్వారా ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకున్నాడు. తనకెంతో ఇష్టమైన డైరెక్టర్స్‌లో త్రివిక్రమ్‌ ఒకరు. ఆర్య సినిమా నుండి బన్నీని ఆరాధిస్తున్నాను. పూజా నాకు మంచి స్నేహితురాలు.. అంటూ సీనియర్‌ నటి టబు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌.. ఇలా ఈ సినిమాకి పని చేస్తున్న ప్రతీ ఒక్కర్నీ పేరు పేరునా సంబోధిస్తూ, ఇంత చక్కని టీమ్‌తో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉందనీ, ఈ సినిమా ద్వారా ఎన్నో మంచి విషయాలు తెలుసుకునే అవకాశం నాకుందనీ, సుశాంత్‌ చెప్పాడు.

 

ఈ మధ్య సుశాంత్‌ ఏమంత యాక్టివ్‌గా లేడు. 'చిలసౌ' సినిమాతో ఓకే అనిపించుకున్నా, ఆ తర్వాత మళ్లీ గ్యాప్‌ తీసుకున్నాడు. తాజాగా అల్లు అర్జున్‌ సినిమాతో మరోసారి స్క్రీన్‌పై దర్శనమివ్వనున్నాడు. అయితే, సుశాంత్‌ ఈ సినిమాలో ఏ క్యారెక్టర్‌ పోషిస్తున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్సే. ఆల్రెడీ తొలి షెడ్యూల్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్‌గా సెకండ్‌ షెడ్యూల్‌ షురూ చేసింది. ప్రస్తుతం హైద్రాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో హీరోయిన్‌ పూజాహెగ్దేతో పాటు, సుశాంత్‌ కూడా హాజరయ్యాడు. హారికా, హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్‌తో కలిసి గీతా ఆర్ట్స్‌ సంస్థ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తోంది. 'అలకనంద' టైటిల్‌ ఈ సినిమాకి పరిశీలిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS