సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మహేష్ బాబు సర్కారు వారి పాట ట్రైలర్ బయటికి వచ్చింది. 2నిమిషాల 30 సెకన్లు గల ట్రైలర్ లో డైలాగులు, యాక్షన్ అదరగొట్టేశారు.
''నా ప్రేమని దొంగిలించగలవు...నా స్నేహాన్నీ దొంగిలించగలవు..యూ కాన్ట్ స్టీల్ మై మనీ.. - ఈ డైలాగ్‌తో మహేష్ క్యారెక్టర్ రివిల్ అయ్యింది. ట్రైలర్ లో చాలా డైలాగులు వినిపించాయి.
''అమ్మాయిల్నీ, అప్పు ఇచ్చిన వాళ్లనీ పేంపర్ చేయాలిరా.. రఫ్‌గా హ్యాండిల్ చేయకూడదు.. - అనేది మరో పంచ్ డైలాగ్. వై.ఎస్.ఆర్ స్లోగన్ ` నేను విన్నాను.. నేను ఉన్నాను..` ఈ ట్రైలర్‌లో మహేష్ పలకడం తన స్తయిల్ప్ పలకడం భలే కుదిరింది. ట్రైలర్ లో మహేష్ వయసు గురించి చూపించిన సూపర్ గా పేలింది .యామయ్యా కిశోర్... మనకేమైనా మారేజ్ చేసుకునే వయసు వచ్చేసిందంటావా..? - అని మహేష్ అడిగితే, - ఊరుకోండి సార్.. మీకేంటి అప్పుడే.. చిన్న పిల్లాడైతే.. - అని వెన్నెల కిషోర్ సమాధానం ఇస్తాడు.
ఆవెంటనే... `అందరూ నీలాగే అంటున్నారయ్యా... దీనెమ్మా మెయిటైన్ చేయలేక దూల తీరిపోతోంది..` అని మహేష్అనడం ఎంటర్ టైనర్ గా వుంది.
ట్రైలర్ లో కథని డైలాగులతోనే చెప్పారు. ''అప్పనేది ఆడపిల్ల లాంటిది సార్.. ఇక్కడెవరూ బాధ్యత గల తండ్రిలా బిహేవ్ చేయడం లేదు.. అనేది మహేష్ క్యారెక్టర్ అయితే.. `నా దృష్టిలో అప్పనేది సెటప్ లాంటిది..` అని చెప్పి విలన్ సముద్రఖని ని ఇంట్రడ్యూస్ చేయడంతో సర్కారు వారి కథపై ఒక ఐడియా ఇచ్చినట్లయింది.
`ఎందుకంటే ఆడిది మరి.. పెద్దా...` ``ఓ వంద వయగ్రాలు వేసి శోభనం కోసం ఎదురు చూస్తున్న పెళ్లి కొడుకు గదికి వచ్చినట్టు వచ్చారు..``అని మహేష్ పలికిన డైలాగ్స్ ఊర మాస్ గా వున్నాయి. యాక్షన్ విజువల్స్ కూడా రిచ్ గా వున్నాయి. టోటల్ గా ట్రైలర్ చూస్తే సర్కాఋ వారి పాట పక్కా మాస్ మసాలా కమర్శియల్ ఎంటర్ టైనర్ అని అర్ధమౌతుంది. మే 12న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.