బాలీవుడ్ విలక్షణ నటి స్వరా భాస్కర్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలవాలనుకుంటుంది. తాజాగా లవ్, బ్రేకప్ గురించి ఓ పిట్ట కథ చెప్పి మరోసారి న్యూస్‌లో హైలైట్ అయ్యే ప్రయత్నం చేసింది. ఇంతకీ స్వర చెప్పిన ఆ పిట్టకథ ఏంటంటారా.? ఆమెకు హిమాంశు శర్మ అనే ఓ లవర్ ఉన్నాడు. కొన్నాళ్లుగా ఈయనతో పీకల్లోతు ప్రేమ వ్యవహారం నడిపించి, సహజీవనం కూడా సాగించింది. అయితే, ఒకానొక టైమ్‌లో వీరిద్దరి మధ్యా బేధాభిప్రాయాలు వచ్చి బ్రేకప్ అయ్యారు. బ్రేకప్ అనేది బాధాకరమే కానీ, తమ మధ్య బ్రేకప్‌కి ఎలాంటి నెగిటివ్ రీజన్స్ లేవనీ, సామరస్య పూర్వకంగానే విడిపోయామని చెబుతూ, తాజాగా ఓ చిన్న స్టోరీతో క్లారిటీ ఇచ్చిందీ హాట్ బ్యూటీ .
పార్కులో ఇద్దరు వ్యక్తులు నడుస్తూ వెళుతున్న క్రమంలో ఎక్కడో ఒక చోట దారి రెండుగా విడిపోతుంది. ఇద్దరూ ఒకే దారిలో వెళ్లాలంటే, ఒక వ్యక్తి అభిప్రాయానికి మరో వ్యక్తి రాజీ పడాలి.. లేదంటే, ఎవరి దారి వారే చూసుకోవాలి.. అలా రాజీని ఇష్టపడని మేము సామరస్యంగా విడిపోవాల్సి వచ్చింది.. అంటూ అర్ధం పర్ధం లేకుండా ఓ స్టోరీ అల్లింది. స్వర భాస్కర్ సంగతి తెలిసిన నెటిజన్లు ఈమెకిదేం కొత్త కాదులే అని సరిపెట్టుకున్నారు. ఇంకొందరైతే, ఆమె పోలికను తప్పు పడుతూ, ప్రేమ, బ్రేకప్ అంటే ఇంత సింపుల్ అయిపోయాయా తల్లీ.. అంటూ విమర్శిస్తున్నారు. ‘వీర్ ది వెడ్డింగ్’, ‘తనూ వెడ్స్ మను’ తదితర చిత్రాలతో స్వరా భాస్కర్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.