వెండితెరపై విజువల్ అద్భుతం 'బాహుబలి'. జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని, ఇండియన్ సినిమా స్టామినాని ప్రూవ్ చేసింది. ఇకపోతే ఇప్పుడు బుల్లితెరపై విజువల్ వండర్‌గా రాబోతోంది 'స్వర్ణఖడ్గం'. అతి త్వరలోనే బుల్లితెరపై ప్రసారం కానున్న ఈ సీరియల్‌ని సత్యనారాయణ డైరెక్ట్ చేశారు.
విజువల్ వండర్స్ కోసం 'బాహుబలి' సినిమాకి పని చేసిన టెక్నీషియన్లే పని చేశారు. 'బాహుబలి' చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలే ఈ సీరియల్‌నీ రూపొందించారు. సీరియలే కదా. అని ఎక్కడా రాజీ పడకుండా 'స్వర్ణఖడ్గం' సీరియల్‌ని రూపొందించారు. కన్నడ నటి సంజన ఈ సీరియల్ లో కీలక పాత్ర పోషించింది. యువరాణీ పాత్రలో సంజన నటిస్తోంది. ఈ పాత్ర కోసం గుర్రపుస్వారీ, కత్తి సాములో ప్రత్యేక శిక్షణ తీసుకుందట సంజన.
ప్రస్తుతం తెలుగులో అవకాశాలు రాకపోయినా, కన్నడ, మలయాళ చిత్రాల్లో అవకాశాలొస్తున్నాయట. అయినా కానీ 'అరుంధతి'లో అనుష్క పాత్రలాంటి అవకాశం వస్తే కాదనగలమా? అది సీరియల్‌నా? సినిమానా? అని చూడలేదు. వెంటనే ఓకే చేసేశాను. చేస్తుంటే తెలిసింది. ఇది జస్ట్ సీరియల్ మాత్రమే కాదు, సినిమా కన్నా చాలా చాలా ఎక్కువ అని. అంత ప్రతిష్ఠాత్మక సీరియల్ ఇది.
బుల్లితెరపై ఇలాంటి ఓ సీరియల్ వస్తుందని ఇంతవరకూ ఎవరూ ఊహించరు. స్క్రీన్‌పై 7 నిముషాలు సీన్ కోసం 8 రోజులు షూటింగ్ చేశామంటేనే ఈ సీరియల్ ప్రత్యేకత ఏంటో అర్ధం చేసుకోవచ్చు అంటోంది నటి సంజన.