దసరాకి చిరంజీవి, నాగార్జున సినిమాలతో పోటీ పడీ మరీ విడుదలైంది `స్వాతిముత్యం`. ఈ సినిమాతో బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అయ్యాడు. రెండు పెద్ద సినిమాల మధ్య `స్వాతిముత్యం` నలిగిపోతుందని ముందే ఊహించారు. అనుకొన్నదే అయ్యింది. సినిమాకి రివ్యూలు బాగా వచ్చాయి. టాక్ బాగుంది. కానీ కలక్షన్లే లేవు. దాంతో... సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్ణయం తప్పని తేలిపోయింది. ఓ వారం రోజులు ఆగి ఉంటే.. ఈ సినిమా ఫలితం మరోలా ఉండేది.
అయితే ఇప్పుడు స్వాతిముత్యం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఆహాలో.. ఈనెల 24న విడుదల చేస్తున్నారు. అంటే.. సినిమా విడుదలైన 20 రోజులకే ఓటీటీకి వస్తోందన్నమాట. నిజానికి ఈనెల 28న ఈ సినిమాని రిలీజ్ చేద్దామనుకొన్నారు. కానీ 4 రోజుల ముందే... బయటకు వచ్చేస్తోంది. థియేటర్లలో ఎక్కడా స్వాతిముత్యం ఆడకపోవడంతో ఈ కీలకమైన నిర్ణయం తీసుకొన్నారు.
ఈరోజుల్లో సినిమాకి మంచి టాక్ వచ్చినా జనాలు థియేటర్లకు రాకపోవడం స్వాతిముత్యం సినిమాకే జరిగిందేమో..? ఏదేమైనా బెల్లంకొండకు ఇది బ్యాడ్ లక్కే. కనీసం ఈ సినిమాని ఓటీటీలో అయినా చూస్తారో లేదో...?