శ్వేతా బసు తెలుగులో గలగలా మాట్లాడేస్తోంటే చాలా ముచ్చటగా అన్పిస్తుంటుంది. తొలి తెలుగు సినిమా 'కొత్త బంగారులోకం'లో ఆమెకు డబ్బింగ్ చెప్పారుగానీ, ఆ డబ్బింగ్ ఆమెకు చాలా బాగా సూట్ అవడంతో అది ఆమె సొంత వాయిస్ అనే అనుకున్నారంతా. డిఫరెంట్ మాడ్యులేషన్‌తో 'కొత్త బంగారు లోకం' సినిమాలో ఆమె లిప్ సింక్, డబ్బింగ్ బాగా సెట్ అయ్యాయి. అయితే ఇప్పుడామె తెలుగులో మాట్లాడేయగలుగుతోంది. డబ్బింగ్ చెప్పుకునే స్థాయికి తన తెలుగు ఇంప్రూవ్ అయ్యిందంటోంది శ్వేతా బసు ప్రసాద్. అయితే ఇదివరకటిలా శ్వేతకి తెలుగులో డిమాండ్ లేదు. చేతిలో 'మిక్చర్ పొట్లం' అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్‌లో ఉత్సాహంగా పాల్గొంటోందీ బెంగాలీ బ్యూటీ. నటన మాత్రమే కాకుండా ఈమెలో రైటింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. కథల్ని తయారు చేయడం, స్క్రీన్‌ప్లే రాసుకోవడం వంటి విభాగాల్లో మంచి అనుభవం కూడా శ్వేత సొంతం. ఆ అనుభవాన్ని తెలుగు సినీ పరిశ్రమలో కూడా వినియోగించాలనుకుంటోందట. మొదట్లో తెలుగు నేర్చుకోవడంపై అంత ఫోకస్ పెట్టకపోయినా, ఇకపై తెలుగు సినిమాల్లో రెగ్యులర్‌గా కనిపించడానికే శ్వేత తెలుగు నేర్చుకుందని సమాచారమ్. ఏదేమైనా కొందరు హీరోయిన్లు తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా, స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చినా తెలుగు నేర్చుకోరు. కొందరు మాత్రం తెలుగులో తక్కువ సినిమాలే చేసినా తెలుగు భాషపై మమకారం పెంచుకుంటారు. శ్వేత రెండో కోవలోకి వస్తుందేమో.