సైరా వ‌ల్ల ఎవ‌రి డ‌బ్బులు పోయాయి?

By iQlikMovies - October 19, 2019 - 12:54 PM IST

మరిన్ని వార్తలు

సైరా ప‌రిస్థితేమిట‌న్న‌ది ట్రేడ్ వ‌ర్గాల‌కే అర్థం కావ‌డం లేదు. రివ్యూలు ఆహా.... ఓహో అన్నాయి. సినిమావాళ్లు కూడా ఆకాశానికి ఎత్తేశారు. తొలి మూడు రోజులూ వ‌సూళ్లు కుమ్మేశాయి. అయితే... ఈ సినిమా ఆర్థికంగా హిట్టా? ఫ‌ట్టా? అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఓవ‌ర్సీస్‌లో ఈ సినిమా కి ఇంకా బ్రేక్ ఈవెన్ రాలేదు. కొన్ని ఏరియాల్లోనూ అదే ప‌రిస్థితి. బాలీవుడ్‌, త‌మిళ‌నాడు, కేర‌ళ‌ల‌లో ఈ సినిమా స‌రైన ఫ‌లితాన్ని అందుకోలేదు. నైజాంలో బ్రేక్ ఈవెన్ సాధించింది. సీడెడ్‌, ఈస్ట్‌, వెస్ట్‌, కృష్ణా, గుంటూరు డిస్టిబ్యూట‌ర్ల‌కు న‌ష్టాలొచ్చే అవ‌కాశాలున్నాయి.

 

ఒక్కో ఏరియాలో దాదాపు 20 శాతం న‌ష్టాలు భ‌రించాల్సివ‌స్తుంది. ఓ సినిమాకి ఇంత మంచి టాక్ వ‌చ్చి, ఓపెనింగ్స్ అదిరిపోయి, రివ్యూలు కూడా పాజిటీవ్‌గా వ‌చ్చి న‌ష్టాల బాట ప‌ట్టారంటే ఆలోచించుకోవాల్సిన విష‌య‌మే. ఎక్కువ రేట్ల‌కు ఈ సినిమా కొనుక్కోవ‌డం బ‌య్య‌ర్ల‌ను ఇబ్బంది పెట్టింది. ఖైది నెం. 150 వ‌సూళ్ల‌ని దృష్టిలో ఉంచుకుని సైరా కొని ఉంటే, ఈ పాటిని డిస్టిబ్యూట‌ర్లంతా లాభాలు చూసేవారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS