తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా 'సైరా నరసింహారెడ్డి'. తెలుగువారందరూ తప్పక తెలుసుకోవల్సిన చరిత్ర ఇది. ఇంతటి గొప్ప చరిత్రను చిరంజీవి పుణ్యమా అని తెలుగు వారు తెలుసుకునే అవకాశం కలుగుతోంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాలో ముఖ్యంగా ఆరు సీన్లు అత్యంత కీలకమైనవిగా ఉంటాయట. వాటిలో ముఖ్యంగా రెండు పోరాట ఘట్టాలకు రోమాలు నిక్కపొడుచుకుంటాయట.
ఆ సీన్లు ఏంటా అంటే, ఇంటర్వెల్ బ్యాంగ్‌కి ముందొచ్చే సీన్ ఒకటి, క్లైమాక్స్ ఎపిసోడ్ ఒకటి అట. ఈ రెండు సీన్లు కాక, మరో నాలుగు యాక్షన్ సీక్వెన్స్ కూడా చెప్పుకోదగ్గవనీ తెలుస్తోంది. వీటి కోసమే కోట్లలో ఖర్చు చేశారట. హాలీవుడ్ కొరియోగ్రఫర్లు ఈ యాక్షన్ ఘట్టాల కోసం కఠోర దీక్ష చేశారట. అవుట్ పుట్ చాలా నేచురల్‌గా వచ్చిందనీ తెలుస్తోంది. చిరంజీవి గుర్రంపై వచ్చి చేసే ఫైట్ సీన్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుందట.
అలాగే కోట బురుజుపై ఓ యాక్షన్ సీన్ తెరకెక్కించారట. ఈ యాక్షన్ సీన్ అత్యంత క్రిటికల్‌గా సాగిందట. మొత్తానికి 'సైరా' ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోందనీ తెలుస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని అక్టోబర్‌లో రిలీజ్ చేయనున్నారు. నయనతార హీరోయిన్‌గా నటించింది. తమన్నా, నిహారికలతో పాటు, అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రలు పోషించారు