'సైరా' సందడి చేస్తాడా.?

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు వచ్చేస్తోంది. అభిమానులకు చిరంజీవి పుట్టినరోజంటే ఎప్పుడూ పండగే. అయితే ఈ సారి మరింత పెద్ద పండగలా భావిస్తున్నారు అభిమానులు. చిరంజీవి నుండి ఏదో ఒక సర్‌ప్రైజ్‌ ఆశిస్తున్నారు. ఖచ్చితంగా చిరంజీవి పుట్టినరోజుకు ఫస్ట్‌లుక్కో, టీజరో ఏదో ఒకటి వస్తుందని ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. 

'సైరా' టీమ్‌ కూడా అదే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చేశాడు. టైటిల్‌ లోగోతో పాటు, ఫస్ట్‌లుక్‌ టీజర్‌ని రిలీజ్‌ చేసి, మహేష్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అయ్యేలా చేసేశాడు. ఇక ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి వంతొచ్చింది. ఆగష్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 'సైరా నరసింహారెడ్డి' టీజర్‌ని విడుదల చేయనున్నారనీ ఆల్రెడీ విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారమ్‌. 

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. అద్భుతమైన యాక్షన్‌ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఇంతవరకూ సిల్వర్‌ స్క్రీన్‌పై కనీ వినీ ఎరుగని యాక్షన్‌ ఎపిసోడ్స్‌ని ఈ చిత్రం ద్వారా చూపించనున్నారట. మరుగున పడిపోయిన తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS