తెలుగు సినిమాకి కర్నాటకలో మంచి మార్కెట్ ఉంది. కర్నాటక హక్కుల రూపంలో మంచి రేట్లే వస్తుంటాయి. పెద్ద హీరోల సినిమా అంటే కనీసం 10 కోట్లు గ్యారెంటీ! ఇప్పుడు చిరంజీవి సినిమా `సైరా` కూడా కర్నాటకలో బిజినెస్ పూర్తి చేసుకుంది. రూ.35 కోట్లకు కర్నాటక రైట్స్ అమ్మేశారు. `సైరా` బిజినెస్ కర్నాటక రైట్స్‌తోనే మొదలవ్వడం, అక్కడ రికార్డు ధరకు అమ్ముడుపోవడం - చిత్రబృందాన్ని జోష్‌లో ముంచెత్తింది.
సైరా అక్కడ రూ.35 కోట్లు పలకడం నిజంగా ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది. `బాహుబలి 2` తరవాత.. ఆ స్థాయిలో ఓ తెలుగు సినిమా అమ్ముడుపోవడం `సైరా` విషయంలోనే జరిగింది. చిరంజీవి స్టామినాకు ఈ లెక్కలు అద్దం పడుతున్నాయి. ఓవర్సీస్, నైజాం రైట్స్ కూడా రికార్డు ధరకి అమ్ముడుపోయే అవకాశం ఉంది. ఈ రెండు హక్కుల విషయంలో గట్టి పోటీ నెలకుంది. వారం రోజుల్లోగా నైజాం, ఓవర్సీస్ రైట్స్ ఎవరు, ఎంతకు చేజిక్కించుకున్నారన్న విషయంలో ఓ స్పష్టత వస్తుంది.