ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించి ఒక్కసారిగా అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకున్న హీరో విశాల్. ఇక ఆయన ఎన్నికల్లో గెలిచే అవకాశం కూడా ఉందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.
అయితే అనూహ్యంగా ఆయన ఎన్నికల్లో పోటీచేయకుండానే నిష్క్రమించాలసిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే, నామినేషన్ వేసే క్రమంలో రెండు సంతకాలు సరిగా లేవు అంటూ ఆయన నామినేషన్ తిరస్కరణకి గురయింది. ఈ తరుణంలో ఆయన తన అనుచరులతో ఆందోళనకి దిగడంతో మళ్ళీ ఆయన నామినేషన్ పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
విశాల్ కూడా చాలా సస్పెన్స్ మధ్యలో తన నామినేషన్ ఎన్నికల అధికారులు తీసుకున్నట్టు ట్వీట్ చేశాడు. అయితే అర్ధరాత్రి సమయంలో ఎన్నికల అధికారులు చివరగా విశాల్ నామినేషన్ తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు.
మొత్తానికి అనేక మలుపులు తిరిగి చివరకు ఆయన నామినేషన్ తిరస్కరణకి గురైంది. అయితే ఈ అంశం పై కోర్టులో అపీల్ కి విశాల & కో వెళుతున్నట్టు తెలిసింది.