దీప్తి నల్లమోతు... కౌశల్ ఫ్యాన్స్ కొత్త టార్గెట్?!

By iQlikMovies - July 31, 2018 - 17:44 PM IST

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ 2వ సీజన్ లో పార్టిసిపెంట్స్ తో పాటుగా కౌశల్ ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఒక బృందం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది.

దీనికి ప్రధాన కారణం, కౌశల్ కోసం వేరే ఇంటి సభ్యులని తిట్టడం అదే సమయంలో బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ తో ఎవరైనా గొడవ పడితే వాళ్ళని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వారు చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. పోయిన వారం నందిని, బాబు గోగినేనిలని టార్గెట్ చేస్తూ వీరు చేసిన ట్రోలింగ్ గురించి వేరేచేప్పకర్లేదు.

ఇక తాజాగా దీప్తి నల్లమోతు-కౌశల్ మధ్య జరిగన విషయం ఏకంగా కౌశల్ ని ఈవారం నామినేషన్లలో నిలబెట్టేసరికి కౌశల్ ఆర్మీ ఈ వారం తమ టార్గెట్ గా దీప్తిని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆమె పైన ట్రోలింగ్ ని వారు మొదలుపెట్టినట్టుగా సోషల్ మీడియా ఒకసారి చూస్తే మనకి అర్ధమైపోతుంది.

అయితే దీప్తి ని టార్గెట్ చేయడానికి కారణం మొన్న నాని ముందు తనతో కౌశల్ అబద్దం చెప్పినట్టుగా చెప్పడం కూడా ఆమె పైన ఈ ఆర్మీకి కోపం పెంచేలా చేసాయాట.

మరి ఇంటిలో ఉన్న వీరిరువురి మధ్య ఈ నామినేషన్ చిచ్చు వారి స్నేహం పైన ఎంతవరకు ప్రభావం చూపనుందో వేచి చూడాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS