అల్లు ఇంట్లో.... మెగా సక్సెస్ పార్టీ.

మరిన్ని వార్తలు

సైరా సూప‌ర్ హిట్టుతో మెగా సంబ‌రాలు మొద‌లైపోయాయి. రెండో రోజే థ్యాంక్స్ మీట్ పెట్టిన `సైరా` బృందం... అదే రోజు రాత్రి మెగా పార్టీ చేసుకుంది. సైరా విజ‌యాన్ని పుర‌స్క‌రించుకుని, అల్లు అర‌వింద్ ఇంట్లో స‌క్సెస్ పార్టీ జ‌రిగింది. ఈ విందుకు సైరా బృందంతో పాటుగా కొంత‌మంది ద‌ర్శ‌కులు, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారని తెలుస్తోంది.

 

ఏదైనా ఓ సినిమా విజ‌య‌వంతం అయితే.. ఇంట్లో పార్టీ ఏర్పాటు చేయ‌డం అల్లు కుటుంబానికి ఆన‌వాయితీగా మారుతోంది. మ‌హాన‌టి సినిమా చూశాక‌.. ఆ చిత్ర‌బృందాన్ని ప్ర‌త్యేకంగా ఇంటికి పిలిచి, స‌త్కరించింది అల్లు కుటుంబం. సైరాకీ అదే ఫాలో అయ్యింది. శుక్ర‌వారం తెల్ల‌వారుఝాము వ‌ర‌కూ ఈ పార్టీ సాగింద‌ని స‌మాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS