సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం పై చర్చోపచర్చలు నడుస్తున్న వేళ ఓ ప్రముఖ నటుడు,నిర్మాత,దర్శకుడైన టీ రాజేందర్ రజిని పై కొన్ని ఘాటైన విమర్శలు చేశాడు.
అసలు రాజకీయాల పై రజినికి ఏమాత్రం కూడా అవగాహన లేదని అలాగే కొత్తగా అమలులోకి వచ్చిన GST బిల్లు వల్ల తమిళ చలనచిత్ర పరిశ్రమపై పడనున్న ప్రభావం పై కూడా నోరుమేదపలేదని విమర్శించాడు.
ఇక ఆయన ఒక స్పష్టత లేని వ్యక్తి అని అలాగే రాజకీయాల్లోకి వస్తే తాను ప్రజలకి ఏమి చేస్తాడో ముందే చెప్పాలని డిమాండ్ చేశాడు.ఇప్పటికే టీ రాజేందర్ అంటే తమిళ నాట మొత్తం ఓ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వ్యక్తిగా పేరున్న సందర్భంలో ఇలాంటి కామెంట్స్ పెద్ద చర్చకే దారితీశాయి.