'ఏం సక్కగున్నావురో నా సొట్ట బుగ్గలోడా..' అంటూ క్యూట్‌గా రాఘవేంద్రరావు సినిమాతో హాట్ హాట్ ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ తాప్సీ. తర్వాత స్టార్ హీరోల సరసన కూడా నటించింది. కానీ నటిగా టాలీవుడ్లో అమ్మడికి సంతృప్తి కలగలేదట. బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ అనూహ్యంగా నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రల్ని ఎంచుకుని మంచి నటిగా గుర్తింపు పొందింది. తర్వాత టాలీవుడ్‌పై విమర్శల అస్త్రాలు కూడా సంధించేసింది. కానీ ఇటీవలే టాలీవుడ్లో 'ఆనందోబ్రహ్మ' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించింది. ఇదిలా ఉండగా, బాలీవుడ్లో ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం 'జుద్వా - 2' సినిమాలో నటిస్తోంది. వరుణ్ ధావన్ ఈ సినిమాలో హీరో కాగా, తాప్సీ హీరోయిన్. ఈ సినిమాలో తాప్సీ గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. కట్టలు తెంచిన అందంతో రెచ్చిపోయింది. బికినీ సొగసులతో కిర్రాకు పుట్టిస్తోంద. బికినీతో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది తాజాగా ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ ఫోటోకి నెటిజన్లు బీభత్సమైన కామెంట్లు వేయడంతో అమ్మడికి కొంచెం కోపమొచ్చింది. టూ పీస్ బికినీతో ఉన్న తాప్సీ ఫోటో చూసి ఒక నెటిజన్ ఇంకా ఆ రెండూ మాత్రం ఎందుకు? అవి కూడా తీసెయ్యొచ్చుగా అని కామెంట్ చేశాడట. ఆ కామెంట్‌కి సంస్కారం లేదా? అంటూ రీ కామెంట్ చేసింది తాప్సీ. సంస్కారం గురించి మాట్లాడితే ఎలాంటి కామెంట్‌ని ఫస్త్రస్ చేయాలో తెలియకనే ఇలా చేసిందా తాప్సీ ఏమో తెలీదు కానీ, తాప్సీ బికినీ ఫోటోలు పెద్ద దుమారమే లేపుతున్నాయిప్పుడు.