అందాల భామ తాప్సీ బాలీవుడ్లో 'ముల్క్ 'సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ఇందులో తాప్సీ నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. టీజర్‌తోనే మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఒక నెటిజన్ 'నీ ఫేస్ కామెడీగా ఉంటుంది. కామెడీ సినిమాలకే నువ్వు సెట్ అవుతావ్. ఇలాంటి సినిమాలు చేసి, ఎందుకు అలాంటి సినిమాల పరువు తీసేస్తున్నావ్..' అని కామెంట్ చేశాడు.
ఆ కామెంట్‌కి తాప్సీ భలే కౌంటర్ ఇచ్చింది. 'ఆ విషయమే నాకూ అర్ధం కావడం లేదు. ఫిల్మ్ మేకర్స్ చాలా మందే ఉన్నారు. నాకు అవకాశాలు ఇస్తున్నారు. మీ క్వశ్చన్ వారిని అడిగితే బావుంటుంది..' అని తాప్సీ ట్వీట్ చేసింది. మామూలుగా ఇలాంటి హ్యాట్ కామెంట్స్‌కి సెలబ్రిటీస్ రెస్పాండ్ అవ్వరు. వారలా రెస్పాండ్ కారు కదా అని నెటిజన్లు చెలరేగిపోతారు. అయితే సుతిమెత్తగా తాప్సీ ఇచ్చిన కౌంటర్‌తో అవతల నెటిజన్‌కి మైండ్ బ్లాంక్ అయిపోయి ఉంటుంది.
మరోవైపు తాప్సీ చాలా హుందాగా స్పందించావ్ అని ఇంకొందరు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. తెలుగులో ఎక్కువగా గ్లామరస్ పాత్రల్లోనే కనిపించినా, బాలీవుడ్‌కెళ్లాక తాప్సీ చాలా మారిపోయింది. ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తోంది. 'పింక్' తదితర చిత్రాలు నటిగా ఆమెకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అవార్డులతో పాటు, విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంటోంది.
ఈ తరుణంలో ఇలాంటి కామెంట్స్ చేసిన ఆ నెటిజన్ ఎవరో కానీ, మొత్తానికి తాప్సీ ఇచ్చిన కౌంటర్ ఎటాక్ మాత్రం అద్దిరిపోయిందంతే.!