బిగ్ బాస్.. బిగ్ బాస్.. ఇప్పుడు ఈ మాట తెలుగు రాష్ట్రాల నోటి నుండి తరచుగా వినిపిస్తున్నది. ఇక ఈ షోలో పాల్గొని వచ్చిన వారి వెంట మీడియా పరుగులు పెడుతున్నది అంటే ఈ షో కి ఎంత ఫాలోయింగ్ ఉందో ఊహించుకోవచ్చు.
ఇంతటి ఆదరణ ఉన్న ప్రోగ్రాముని మన సినిమావాళ్ళు ఎలా వదిలిపెడతారు. ఈ మధ్యనే రానా తన చిత్రం- నేనే రాజు నేనే మంత్రి ప్రొమోషన్ కార్యక్రమాలని బిగ్ బాస్ లో చేయగా, ఇప్పుడే అదే దారిలో హీరోయిన్ తాప్సీ కూడా నడుస్తున్నది.
ఈ రోజు ఎపిసోడ్ లో నటి తాప్సీ, బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనుంది. అందులోని వారితో గడుపుతూ తన సినిమా యొక్క ప్రమోషన్ చేయనుంది.
మొత్తానికి.. బిగ్ బాస్ షో ఇప్పుడు ఒక పెను సంచలనం అనే చెప్పాలి.