సొట్ట బుగ్గల సుందరికి మరో బంపర్‌ ఆపర్‌

మరిన్ని వార్తలు

తెలుగులో గ్లామర్‌ డాళ్‌గా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ తాప్సీకి బాలీవుడ్‌లో తిరుగు లేని ఆఫర్లు అందుతున్నాయి. బాలీవుడ్‌లో అడుగు పెట్టిన కొద్ది కాలంలోనే ఈ బ్యూటీ వరుస అవకాశాలు దక్కించుకోవడంతో పాటు, హీరోయిన్‌ ప్రాధాన్యత ఉన్న సినిమాలతో అక్కడ స్టార్‌ హీరోయిన్స్‌కి ధీటుగా దూసుకెళ్లిపోతోంది. డిఫరెంట్‌ వేరియేషన్స్‌ ఉన్న సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. 

ఇప్పటికే బాలీవుడ్‌లో చాలా సినిమాల్లో నటిస్తోంది తాప్సీ. వాటిలో 'దిల్‌ జంగ్లీ' సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇదో కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రం. కాగా 'సూర్మ' అనే ఓ ప్రత్యేక చిత్రంలో నటిస్తోంది. అలాగే 'ముల్క్‌' అనే మరో చిత్రం కూడా తాప్సీ చేతిలో ఉంది. వరుస సినిమాలే కాదు, ఆ మాటకొస్తే, తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్‌లో నటిస్తున్న అన్ని చిత్రాలు ఇంపార్టెంట్‌ అండ్‌ ఇంట్రెస్టింగ్‌ సబ్జెక్ట్స్‌తో తెరకెక్కుతున్నవే. ఇవిలా ఉండగా, తాజాగా మరో బంపర్‌ ఆఫర్‌ తాప్సీ చేతిలో పడింది. అదే 'మన్మార్జియాన్‌'. అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అభిషేక్‌ బచ్చన్‌ హీరోగా నటిస్తున్నాడు. 

మొదట్లో ఈ సినిమాలో హీరోగా దుల్కర్‌ సల్మాన్‌ని అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. దాంతో అభిషేక్‌తో నటించే ఛాన్స్‌ దక్కించుకుందీ సొట్ట బుగ్గల సుందరి. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ ఈ సినిమాకి నిర్మాత కాగా, ఇరోస్‌ సంస్థ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. ఫిబ్రవరి నుండి ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. ఇటీవలే 'జుద్వా - 2'తో బాలీవుడ్‌లో విజయం అందుకున్న తాప్సీ, తెలుగులో 'ఆనందోబ్రహ్మ' సినిమాలో నటించి, ఇక్కడ కూడా సింపుల్‌గా హిట్‌ కొట్టేసింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS