సీనియర్స్ కి నో చెప్తున్న దేవరకొండ

మరిన్ని వార్తలు

ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తక్కువ టైమ్ లో స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవర కొండ. విజయ్ రెండు మూడు సినిమాలతో తన నటనతో, ఆటిట్యూడ్ తో అగ్ర హీరోల సరసన చేరాడు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక ట్రెండ్ సెట్ చేసాడు. కెరియర్ లో డిజాస్టర్లు ఎదురైనా విజయ్ కి ఉన్న డిమాండ్, క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. స్టార్ డైరక్టర్స్ విజయ్ తో వర్క్ చేయాలనీ తహ తహ లాడుతున్నారు. కానీ విజయ్ మాత్రం స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి వెనకాడుతున్నారని, కొత్తవారితోనూ, యంగ్ డైరెక్టర్స్ తో మాత్రమే వర్క్ చేయటానికి ఇంట్రస్ట్ గా ఉన్నారని, విజయ్ లైనప్ చూస్తే ఇదే విషయం స్పష్టమవుతుంది అని టాక్. పూరి జగన్నాథ్ తో చేసిన లైగర్ సినిమానే ఇందుకు కారణం అని గుస గుసలు వినిపిస్తున్నాయి.


పూరి జగన్నాథ్ డైరక్షన్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన లైగర్ డిజాస్టర్ తో విజయ్ కోలుకోలేని దెబ్బతిన్నాడు. నెక్స్ట్ శివ నిర్వాణ తో ఖుషితో వచ్చాడు. ఈ మూవీ యావరేజ్ టాక్ తో బయట పడ్డాడు. ఇప్పుడు తన కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన గీత గోవిందం  డైరక్టర్ పరశు రామ్ ని నమ్ముకుని ఫ్యామిలీ స్టార్ తో రానున్నాడు. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్, దివ్యాంక కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నా ఈ మూవీకి  దిల్ రాజు నిర్మాత. ఏప్రిల్ 5న ఈ సినిమా ఆడియన్స్  ముందుకు రానుంది. ఈ మూవీ కంప్లీట్ కావటంతో, విజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చర్చలు మొదలయ్యాయి. విజయ్ కోసం  సుకుమార్, కొరటాల శివ లాంటి క్రేజీ డైరెక్టర్స్ ఎదురుచూస్తుండగా విజయ్ మాత్రం వాళ్లను పక్కన పెట్టి యంగ్ డైరెక్టర్స్ కే ప్రాధాన్యతనిస్తున్నారని సమాచారం.


నెక్స్ట్  గౌతం తిన్ననూరి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలకు చెందిన పలువురు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ తో విజయ్ సినిమాలు కమిట్ కానున్నట్లు సమాచారం. రాజా వారు రాణి గారు ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మాణంలో ఒక సినిమా, కెప్టెన్ మిల్లర్ సినిమా డైరక్ట్ చేసిన అరుణ్ ముత్తేశ్వరన్, కన్నడ డైరెక్టర్ నార్తన్ లతో విజయ్ చర్చలు జరిపి, వారి కథలు నచ్చటంతో ఓకే  చెప్పినట్టు అన్నీ కుదిరితే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS