మిథాలీ రాజ్‌గా తాప్సీని చూశారా?

మరిన్ని వార్తలు

మహిళా ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే పేరు మిథాలీ రాజ్‌. మహిళా క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌గా రికార్డుల మోత మోగించిన మిథాలీ రాజ్‌ జీవిత గాధ ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆ బయోపిక్‌లో లీడ్‌ రోల్‌ పోషిస్తోంది ముద్దుగుమ్మ తాప్సీ పన్ను. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశారు. మిథాలీ రాజ్‌ పాత్రలో తాప్సీ ఒదిగిపోవడం తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అవును. ఈ సినిమా కోసం తాప్సీ చాలా చాలా కష్టపడింది. అంతేకాదు, చాలా బెస్ట్‌ ఛాన్సెస్‌ కూడా వదులుకుంది. కానీ, ఈ ఫస్ట్‌లుక్‌ చూస్తే, తాప్సీ ఎందుకలా చేసిందో అర్ధమవుతోంది.

 

క్రీడా నేపథ్యమున్న సినిమాలు ప్రస్తుతం ఏ స్థాయిలో ఆదరణ దక్కించుకుంటున్నాయో చూస్తున్నాం. లేటెస్ట్‌గా కంగనా నటించిన కబడ్డీ నేపథ్యమున్న చిత్రం 'పంగా' విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సక్సెస్‌ఫుల్‌ రన్‌ రేట్‌తో ప్రదర్శితమవుతోంది. అలాంటిది ఓ మహిళా క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ బయోపిక్‌ అంటే, ఖచ్చితంగా అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. అందులోనూ మిథాలీ రాజ్‌ ఓ సెన్సేషన్‌. ఈ సినిమా తాప్సీ కెరీర్‌లో ఓ మైలు రాయిగా నిలిచిపోవడం ఖాయమని ఫస్ట్‌లుక్‌కి వస్తున్న రెస్పాన్స్‌ బట్టి అర్ధమవుతోంది. వయాకామ్‌ 18 సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. రాహుల్‌ ధోలాకియా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని హిందీతో పాటు, తెలుగు తదితర సౌత్‌ భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS