తాప్సీ చెల్లెలు కూడా వస్తోంది

మరిన్ని వార్తలు

సినీ పరిశ్రమలో ముందుగా అక్క అడుగు పెడితే, అదే దారిలో నడిచేందుకు చెల్లెళ్లు కూడా ఇష్టపడుతుంటారు. అయితే ముందుగా వచ్చిన అక్క మాదిరి చెల్లెళ్లు సక్సెస్‌ అయ్యారా? లేదా? అనే సంగతి పక్కన పెడితే, నటనపై ఉన్న ఆశక్తిని ఒకటి రెండు సినిమాల్లో నటించిన అయినా తీర్చుకోవాలని అనుకుంటారు. 

టాలీవుడ్‌లో గ్లామర్‌ తారగా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ తాప్సీ బాలీవుడ్‌కెళ్లి అక్కడ వరుస ఆఫర్స్‌తో దూసుకెళ్తోన్న సంగతి తెలిసిందే. మంచి నటిగా ప్రూవ్‌ చేసుకుంటోంది తాప్సీ బాలీవుడ్‌లో. కాగా, ఇప్పుడు తాప్సీ తన చెల్లెలు షగున్‌ని కూడా సినిమాల్లోకి తీసుకురాబోతోందట. తాప్సీకి ఉన్న మాట ఉన్నట్లుగా బల్ల గుద్దినట్లు చెప్పడం అలవాటు. అస్సలేమాత్రం మొహమాటపడదు. భయపడదు. తనకున్న ఆ డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ మెంటాల్టీతో పలు విమర్శలు కూడా ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తన చెల్లెలి తెరంగేట్రం గురించి చెబుతూ కూడా తాప్సీ కొన్ని ఇంట్రెస్టింగ్‌ మాటలు చెప్పుకొచ్చింది. 

ఇండస్ట్రీలో తాను హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎవరెలాంటి వారు..? ఇక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయి..? అనే అంశాలపై అంతగా అవగాహన లేదనీ, కానీ ఇప్పుడలా కాదనీ, తన చెల్లెలికి ప్రతీ విషయాన్ని దగ్గరుండి అనుభవపూర్వకంగా చెప్పగలిగే శక్తి సామర్ధ్యాలు, అనుభవం తనకున్నాయనీ చెబుతోంది తాప్సీ. ఈ సంగతిటుంచితే, తాప్సీ తన చెల్లెలు షగున్‌ని తనలాగా టాలీవుడ్‌ నుండి తెరంగేట్రం చేయిస్తుందో, లేక డైరెక్ట్‌గా బాలీవుడ్‌ నుండే తెరంగేట్రం చేయిస్తుందో చూడాలి మరి. 

ప్రస్తుతం తాప్సీ 'ముల్క్‌', 'సూర్మా' చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలూ ఒకదానికొకటి విభిన్నమైన కథా చిత్రాలు కావడం విశేషం.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS