అటు గ్లామర్ పాత్రలు చేస్తూ, ఇటు కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాల్ని ఎంచుకోవడం మామూలు విషయంకాదు. మన హీరోయిన్లు ఏదో ఒక దానితో సర్దుకుంటుంటారు. గ్లామర్ ఉండగానే - లేడీ ఓరియెంటెడ్ పాత్రలవైపు దృష్టి పెట్టింది నయనతార. అందుకే సౌత్ ఇండియాలో నెంబర్ వన్ హోదా దక్కించుకుంది. ఇప్పుడైతే - కేవలం కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలే చేస్తోంది. తెలుగు, తమిళం... రెండు చోట్లా తనకు మార్కెట్ ఉంది కాబట్టి - నయన సినిమాలు కమర్షియల్ గా వర్కవుట్ అయిపోతున్నాయి. ఈ కేటరిగీలో నయనకు పోటీ ఇచ్చే నాయికలే లేరనుకుంటున్న తరుణంలో తాప్సి వచ్చింది.
తెలుగులో తాప్సిని కేవలం గ్లామర్ తారగానే చూశాం. అయితే బాలీవుడ్‌లోనే తనలోని అసలైన నటి బయటకు వచ్చింది. పింక్ సినిమాతో తాప్సి అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు దక్కుతున్నాయి. ఆనందో బ్రహ్మతో తెలుగులోనూ అలాంటి కథలకు న్యాయం చేయగలనని నిరూపించుకుంది తాప్సి. ఇప్పుడు `గేమ్ ఓవర్`తో మరోసారి తన ప్రతిభని బయటపెట్టింది. తాప్సికి తెలుగులో ఎంత మార్కెట్ ఉందో, తమిళంలోనూ అంతే ఉంది. బాలీవుడ్ లోనూ ఆమె సినిమాలకు గిరాకీ ఏర్పడుతోంది. సో... నయన కంటే తాప్సినే ఇప్పుడు బెటర్ ఛాయిస్ అయ్యింది. నయనని సోలో హీరోయిన్ గా చూసీ చూసీ విగుసొచ్చింది. ఇప్పుడు అలాంటి కథలకు తాప్సి బెస్ట్ ఆప్షన్‌గా మారబోతోంది. ఈ లెక్కన నయనకు పోటీ దారి తయారైనట్టే.