టబు పేరు చెప్పగానే మనకి గుర్తు వచ్చే పేరు “పండు”. ఈ పేరుతో ఆమె చేసిన రోల్ మొత్తం తెలుగు కుర్రకారుకి నిద్రలేకుండా చేసింది. టబు గ్లామర్ కి తప్ప యాక్టింగ్ కి పనికి రాదు అని చెప్పిన వారికి తన నేషనల్ అవార్డ్స్ తోనే సమాధానం చెప్పింది.
అయితే కెరీర్ స్టార్ట్ చేసిన ఇన్ని రోజులకి తను అందరిని “గోల్ మాల్” చేయడానికి సిద్ధం అవుతుంది. వివరాల్లోకి వెళితే, బాలీవుడ్ లో గోల్ మాల్ సిరీస్లో వచ్చిన అన్ని సినిమాలు ఘన విజయం సాదించాయి. అదే హిట్ ఫీట్ ని కంటిన్యూ చేయాడానికిడైరెక్టర్ రోహిత్ శెట్టి “గోల్ మాల్ అగైన్” పేరుతో కొత్త ఫిలిం స్టార్ట్ చేయబోతున్నాడు.
అందులో మన టబుని కీలక పాత్ర కోసం తీసుకున్నాడట. అయితే అందరు టబులోని సీరియస్ యాక్టింగ్ చూసారు కాని తనలోని కామెడీని ఇంతవరకు ఎవరు చూడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో టబు ఈ సినిమా ఒప్పుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది.
చూద్దాం.. మన టబు “గోల్ మాల్”తో అందరిని “గోల్ మాల్” చేస్తుందా లేక తనే “గోల్ మాల్” అవుతుందా అని!!