ఈ వారం విడుదలైన రెండు భారీ చిత్రాలలో ఒకటి హీరో నాని చేసిన MCA మరొకటి అఖిల్ చేసిన హలో.
ఈ రెండు చిత్రాలు ఒకరోజు వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యాయి. ముందుగా నాని MCA చిత్రం గురించి మాట్లాడుకుందాం..
మిడిల్ క్లాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేద్దాము అనే ఉద్దేశ్యంతో ఈ సినిమాకి మిడిల్ క్లాసు అబ్బాయి అని టైటిల్ పెట్టి అలాగే ఈ సినిమాలో నానితో ఒక మధ్య తరగతి అబ్బాయి తరహా పాత్ర పోషించింపచేశాడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు. అయితే కథలో పెద్దగా బలం లేకపోవడంతో ఈ సినిమాకి మొదటిరోజే యావరేజ్ టాక్ రావడం జరిగింది.
అయితే ఇప్పటికే వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నానికి కలెక్షన్స్ పరంగా ఈ చిత్రం గట్టెక్కుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటె మూడు రోజుల్లో ఈ చిత్రం దాదాపు రూ 20 కోట్లు షేర్ సాదించడమే ఇందుకు ఉదాహరణ.
ఇక రెండవ చిత్రం హలో విషయానికి వస్తే, మొదటి చిత్రమే పెద్ద ఫ్లాప్ అవ్వగా, తన రెండవ చిత్రంతో అయినా తన సత్తా ఏంటో ఆడియన్స్ కి చూపెట్టే ప్రయత్నమే ఈ హలో. విక్రమ్ దర్శకత్వం, PS వినోద్ కెమెరాపనితనం, అఖిల్ నటన, ఫైట్లు, డ్యాన్సులు ఈ సినిమాకి హైలైట్ అని అంటున్నారు.
కథ పరంగా ఇంతకముందే చూసేసినా విక్రమ్ తన మార్కు ట్రీట్మెంట్ తో ఈ చిత్రాన్నితనదైన శైలిలో చూపెట్టడంతో హలో చిత్రం ఆడియన్స్ ని ఆకట్టుకున్తున్నది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఓవర్సీస్ లో హలో చిత్రానికి మంచి ఓపెనింగ్స్ రావడం కూడా అఖిల్ కెరీర్ కి కలిసొచ్చే అంశం. తెలుగు తెరకి హలో తో పరిచయం అయిన కళ్యాణికి కూడా తెలుగులో నటిగా మంచి భవిష్యత్తు ఉందన్నది సినీ వర్గాల మాట.
ఇది ఈ వారం టాక్ అఫ్ ది వీక్.