ఈ వారం విడుదలైన రెండు స్ట్రెయిట్ ఒక అనువాద చిత్రాలలో ప్రేక్షకులు స్ట్రెయిట్ చిత్రాల వైపే మొగ్గుచూపారు. ఆ రెండు ఏంటి అంటే- సాయి ధరం తేజ్ జవాన్ & గోపీచంద్ ఆక్సిజన్.
ఇక ఈ రెండు చిత్రాల టాక్ ఎలా ఉందంటే- ముందుగా గోపీచంద్ ఆక్సిజన్ గురించి మాట్లాడుకుందాం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఏఏం రత్నం పెద్ద కుమారుడైన ఏఏం జ్యోతికృష్ణ దర్శకత్వం వహించాడు. దాదాపు 14 ఏళ్ళ తరువాత జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం ఇది.
కథ పరంగా ఒక సామాజిక దురలవాటు పైన అవగాహన కలిపించేలా ఆయన చేసిన ప్రయత్నం అభినందించదగ్గదే అయినప్పటికీ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల తెరపైన చూపెట్టేక్రమంలో అంతగా ఆకట్టుకోలేకపోయాడు అన్న అభిప్రాయం వ్యక్తమైంది. కథనం పరంగా మరింత ప్రయత్నించి ఉంటే ఈ చిత్రం తాలుకా రిజల్ట్ పాజిటివ్ గా ఉండేది.
ఇక రెండవ చిత్రమైన జవాన్ విషయానికి వస్తే, రచయత-దర్శకుడు ఈ చిత్రానికి ఒక్కడే కావడం బాగా కలిసొచ్చిన అంశం. BVS రవి దర్శకుడిగా ఇంకా మెరుగుపడాల్సి ఉన్నది అని మనకి అనిపిస్తుంది ఈ చిత్రం చూసాక. అయితే జవాన్ కథ, సాయి ధరం అభినయం, ముఖ్యంగా హీరో-విలన్ మధ్యలో జరిగే ఆసక్తికర కథనం ఈ చిత్రాన్ని గట్టేకించాయి అని చెప్పుకోవచ్చు.
అలాగే జవాన్ ని ఒక పక్కా కమర్షియల్ చిత్రంగా మలచడంతో మెగా ఫ్యాన్స్ కి ఈ చిత్రం బాగా చేరువ కాగలిగింది. ఇక వసూళ్ళు కూడా ఒకే లెవెల్ లో సాగుతుండడం కూడా ఈ సినిమాకి కలిసొచ్చే అంశం. అయితే ఇంకొక రెండు రోజుల ఆగి కలెక్షన్స్ పరిశీలిస్తే ఈ చిత్రం కమర్షియల్ గా ఎంతటి సక్సెస్ సాదించింది అన్నది తెలుస్తుంది.
ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.