టాక్ అఫ్ ది వీక్: ఆఫీసర్, రాజుగాడు & అభిమన్యుడు

By iQlikMovies - June 03, 2018 - 16:06 PM IST

మరిన్ని వార్తలు

దాదాపుగా వేసవి సీజన్ పూర్తయ్యే సమయంలో ఉన్నాము. అందుకే ఈ వారం మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. అందులో రెండు తెలుగు సినిమాలు కాగ ఒకటి మాత్రం తమిళ డబ్బింగ్ చిత్రం.

ముందుగా తెలుగు సినిమాలు అయిన ఆఫీసర్ & రాజుగాడు చిత్రాల గురించి మాట్లాడుకుందాం. రెండు దశాబ్దాల తరువాత నాగ్-వర్మ కలయికలో వచ్చిన ఆఫీసర్ చిత్రం ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. శివ అంతటి గొప్ప చిత్రం కాకపోయినా ఒక మంచి హిట్ చిత్రం కోసం ఎదురుచూసిన వారికి నిరాశే మిగిల్చింది.

కొత్త కథ కాకపోవడం, ప్రేక్షకులని ఆకట్టుకునే అంశాలు పెద్దగ లేకపోవడంతో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడింది. దీనితో చాల రోజుల తరువాత వీరు ఇరువురు కలిసి తీసిన చిత్రం ఫ్లాప్ అయింది.

రెండవ చిత్రం అయిన రాజుగాడు విషయానికి వస్తే, దర్శకుడు మారుతీ మూలకథ అందించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకురాలు సంజనా రెడ్డి తెరకేక్కించింది. కథనంలో, దర్శకత్వంలో లోపాలు వెరసి ఈ చిత్రం పట్టాలు తప్పింది. హాస్యం అక్కడక్కడా పండినా సినిమా మొత్తంగా నిరాశనే మిగిల్చింది.

హిట్ కోసం ఎదురుచూస్తున్న రాజ్ తరుణ్ కి కూడా ఈ చిత్రం అతని ఫ్లాప్ లిస్టులో చేరిపోయింది. ఇది రాజుగాడు సంగతి.

ఇక ఈ వారం విడుదలైన మూడవ చిత్రం అభిమన్యుడు. ఇది విశాల్-సమంత తమిళంలో చేసిన  ఇరుంభు తిరై చిత్రానికి తెలుగు డబ్బింగ్ వెర్షన్. సైబర్ క్రైం నేపద్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకి ఒక మంచి థ్రిల్ కచ్చితంగా ఇస్తుంది అని చెప్పొచ్చు. కథ చెప్పే విధానంలో గాని సినిమాలో వచ్చే చిన్న చిన్న అంశాల పైన దర్శకుడు ఎంతో శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తుంది.

అయితే మొత్తం సైబర్ చుట్టూ తిరిగే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించకపోవచ్చు, కాకపోతే ఈ సినిమా చూసిన వారు మాత్రం ఈ చిత్రానికి మంచి మార్కులే వేస్తున్నారు. తమిళంలో హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా హిట్ అవ్వాలని కోరుకుందాం..

ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.    

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS