పెళ్ళి అయిపోయాక హీరోయిన్లు సినిమాలలో రాణించలేరు అన్న స్టీరియోటైపు నమ్మకాన్ని బ్రేక్ చేస్తూ సమంత తన కెరీర్ లో దూసుకుపోతున్నది. చేతినిండా విజయాలు, కొత్త సినిమాలతో ఆనందంగా కనిపిస్తున్నది సమంత.
ఇక ఆమె తాజా చిత్రం సావిత్రి గురించి మాట్లాడుతూ- ఈ చిత్రం తన జీవితంలో మరిచిపోని ఒక చిత్రంగా మిగిలిపోయింది. పైగా ఈ సినిమా ద్వారా సావిత్రి జీవితాన్ని అతి దగ్గర నుండి తెలుసుకునే అవకాశం వచ్చింది. అదే సమయంలో నా జీవితం కూడా సావిత్రిలానే అయిపోయి ఉండేది కదా అని అనిపించిన క్షణాలు కూడా ఉన్నాయి. నా అదృష్టం బాగుంది అందులో నుండి బయటపడగాలిగాను.
ఇంతకి ఆమె ఈ మాట అనడానికి వెనుక కారణం మనకి ఇప్పటికే అర్ధమై ఉండాలి. గతంలో ఆమె ఒక హీరోతో ప్రేమలో ఉండడం అది కాస్త దాదాపుగా పెళ్ళి వరకు వెళ్ళిన సంగతి తెలిసిందే. కారణాలు తెలియనప్పటికి వారు విడిపోవడం ఆ తరువాత చైతన్యతో ప్రేమలో పాడడం పెళ్ళి చేసుకోవడం జరిగిపోయాయి.
మొత్తానికి ఈ సినిమా ద్వారా తన వ్యక్తిగత జీవితంలో ఎదురైనా అనుభవం కూడా మరోసారి చూడగలిగింది.