2017 సంవత్సరానికి ఈరోజుతో ముగింపు పలకబోతున్నాము. ఈ తరుణంలో తెలుగు సినిమాల పరంగా ఆఖరిగా విడుదల అయిన ఈ సంవత్సరపు ఆఖరి రెండు సినిమాలు- ఒక్క క్షణం & 2 కంట్రీస్. ఈ రెండు మొన్న శుక్రవారం విడుదలయ్యాయి.
ముందుగా అల్లు శిరీష్ నటించిన ఒక్క క్షణం గురించి మాట్లాడుకుంటే- దర్శకుడు VI ఆనంద్ ఈ చిత్రం ద్వారా Parallel Life అంశాన్ని తెరపై చూపించాడు. ఈ అంశంతో ప్రేక్షకులకి ఒక్క క్షణం చిత్రం పైన అందరికి ఆసక్తి పెంచాడు. ఇక సినిమా విషయానికి వస్తే, రొటీన్ మర్డర్ థ్రిల్లర్ ని Parallel Life అంశంతో జోడించి తెర పైన చూపెట్టడంలో మాత్రం దర్శకుడు కొద్దిగా తడబడ్డాడు.
సినిమాలో ట్విస్ట్ లు బాగానే ఉన్నా సినిమా నిడివి కూడా ఒక అడ్డంకిగా మారింది. అయితే ఈ సినిమాని ఇంకా బాగా తీసి ఉండవచ్చు అన్న అభిప్రాయం ఎక్కువమందిలో కనపడింది. అల్లు శిరీష్ కి మాత్రం తన కెరీర్ పరంగా ఈ సినిమా ప్లస్ గా మారింది అని కచ్చితంగా చెప్పొచ్చు.
ఇక రెండవ చిత్రం సునీల్ హీరోగా నటించిన ‘2 కంట్రీస్’. ఈ చిత్రం అన్ని రకాలుగా ప్రేక్షకులని నిరశాపరచడమే గాక కలెక్షన్స్ లేక అటు నిర్మాతలని సైతం నిరాశపరిచింది. ఇప్పటికే పలు ఫ్లాప్ చిత్రాలతో హీరోగా సునీల్ ఉనికి ప్రశ్నార్ధకంగా ఉన్న ఈ తరుణంలో ‘2 కంట్రీస్’ పరజాయం ఆయనని మరింత కుంగతీయనుంది అన్నది నిజం.
దర్శకుడు N శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మించడం కూడా జరిగింది. అయితే ఈ సినిమా వరకు, ఈయన ఈ రెండు పాత్రల్లో విజయం సాదించలేకపోయాడు.
దీనితో ఈ సంవత్సరపు ఆఖరి సినిమా పరజాయంతో ఈ 2017 సంవత్సరం ముగిసింది అని చెప్పొచ్చు. ఇది ఈ వారం టాక్ అఫ్ ది వీక్.