ఈ వారం మొదట్లో కమెడియన్ విజయ్ ఆత్మహత్య ఉదంతం ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీని షాక్ కి గురిచేసింది.
విజయ్ ఆత్మహత్య వెనుక ఆయన భార్య ఉందంటూ ప్రచారం రావడం పోలీసులు తమకి అందిన ఫిర్యాదుతో ఆమె పైన కేసు నమోదు కూడా చెయ్యడం జరిగింది. ఇదిలావుండగా విజయ్ భార్య వనిత రెడ్డి ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్ళడంతో ఈ కేసులో పెద్ద ట్విస్ట్ గా మారింది. విజయ్ తండ్రి కూడా తమ కోడలు పెట్టిన మానసిక హింస వల్లే విజయ్ చనిపోయాడు అని ఆరోపించాడు. పరారీలో ఉన్న ఆమెని అదుపులోకి తీసుకునేందుకు ఇప్పటికే మూడు బృందాల్లో పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నారు.
అయితే నిన్న వనిత రెడ్డి ఒక సేల్ఫీ వీడియో మీడియా కి విడుదల చేయడం అందులో తాను నిర్దోషి అనే చెప్పే ప్రయత్నం చేస్తూ, విజయ్ పైన ఆరోపణలు గుప్పించింది. ఇవే కాకుండా విజయ్ వేరే అమ్మాయితో సన్నిహితంగా ఉన్న ఫోటోలని మీడియా కి లీక్ చెయ్యడంతో ఈ కేసు మరో మలుపు తిరగింది.
ఇప్పుడు విజయ్ తల్లిదండ్రులు చెప్తున్న దాంట్లో నిజం ఉందా లేక వనిత రెడ్డి చెబుతున్న దాంట్లో నిజం ఉందా అన్న సందేహం అందరిలోనూ మొదలైంది.
అయితే పోలిసుల విచారణ పూర్తయితే తప్ప ఇందులో నిజానిజాలు తెలియవు అన్నది సత్యం. ఇది ఈ వారం టాక్ అఫ్ ది వీక్.