అక్కడి స్టార్‌ హీరోలతో మిల్కీబ్యూటీ పోటీ!

మరిన్ని వార్తలు

'ఎఫ్‌ 2' హిట్‌తో తమన్నా దశ తిరిగిపోయింది. ఇప్పుడు 'సైరా నరసింహారెడ్డి'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది తమన్నా. 'సైరా'తో తమన్నా మరోసారి సత్తా చాటేలా కనిపిస్తోంది ప్రచార చిత్రాలు చూస్తుంటే. ఇక మరోవైపు తమిళంలో కూడా తమన్నా హవా నడుస్తోంది. తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'పెట్రోమాక్స్‌' సినిమా దీపావళికి విడుదలయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

 

ఈ సినిమాలో తమన్నా దెయ్యం పాత్రలో కనిపించనుంది. తెలుగులో చిన్న సినిమాగా తెరకెక్కిన 'ఆనందోబ్రహ్మ'కు తమిళ రీమేక్‌ ఇది. తాప్సీ నటించిన పాత్రలో తమన్నా నటిస్తోంది. యోగిబాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే, దీపావళి రేసులో ఇప్పటికే స్టార్‌ హీరోలు విజయ్‌, కార్తి, విజయ్‌ సేతుపతి తమ తమ సినిమాలతో సిద్ధంగా ఉన్నారు. విజయ్‌ నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'బిగిల్‌', కార్తి హీరోగా 'ఖైదీ' చిత్రంతో పాటు, విజయ్‌ సేతుపతి నటించిన 'సంగతమిళన్‌ చిత్రాలు దీపావళికి విడుదల కానున్నాయి. ఈ మూడు సినిమాలూ భారీ అంచనాలతో విడుదలవుతున్నాయి.

 

అయితే, వీటి మధ్య తమన్నా నెగ్గుకు రాగలదా? అంటే ఆ సత్తా ఉందంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. ఎందుకంటే, హారర్‌ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. ఈ జోనర్‌ మూవీస్‌కి తమిళంలో ఆదరణ ఎక్కువే. ఆ మాటికొస్తే, కంటెంట్‌ బాగుంటే, ఎక్కడైనా సక్సెస్‌ అవుతున్నాయి ఈ జోనర్‌ మూవీస్‌. సో తమన్నా 'పెట్రోమాక్స్‌' కూడా అలాగే విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. అంతేకాదు, ఆ ముగ్గురి స్టార్‌ హీరోలకూ తమన్నా గట్టి పోటీ అవుతుందని కూడా అంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS