కన్నీరుమున్నీరైన చంద్రముఖి అలియాస్‌ శ్రీముఖి.!

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ సీజన్‌ 3 స్టార్టయ్యి 60 రోజులైన సందర్భంగా ఇంటి సభ్యులందరికీ బిగ్‌బాస్‌ ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. కానీ, ఈ సర్‌ప్రైజ్‌ని దక్కించుకోవాలంటే లక్కుండాల్సిందే. అంతే కదా.. బిగ్‌బాస్‌ పెద్ద ఫిటింగ్‌ మాస్టర్‌. దక్కినట్లే దక్కించి, ఏదో ఫిటింగ్‌ పెడతాడు. అలాగే ఇప్పుడు కూడా. ఇంతకీ బిగ్‌బాస్‌ పెట్టిన ఫిటింగ్‌ ఏంటంటే, ఇంటి సభ్యులందర్నీ లివింగ్‌ రూమ్‌లోని సోఫాలో కూర్చోమన్నాడు. ఇందులో మెలికేముందంటారా? కాస్త ఆగండి బాస్‌.

 

సోఫాలోంచి కదలకూడదు, మాట్లాడకూడదు అనే రూల్‌ పెట్టాడు. తదుపరి వారి కుటుంబ సభ్యులను, స్నేహితులను స్క్రీన్‌పై ప్రవేశ పెట్టాడు. సడెన్‌గా వారిని చూసిన ఇంటి సభ్యులు నిజంగానే ఆశ్చర్యంతో కూడిన ఎమోషన్‌ ఫీల్‌ అయ్యారు. శివజ్యోతి, శ్రీముఖిలు మాత్రం కన్నీరు ఆపుకోలేకపోయారు. విపరీతంగా ఏడ్చేశారు. శివజ్యోతికి వాటర్‌ ట్యాంకర్‌ అనే పేరు ఎలాగూ ఉందిలెండి. అయితే, ఈ సారి శ్రీముఖి ఎందుకో చాలా ఎమోషనల్‌ అయ్యింది. తన తమ్ముడ్ని చూసి అస్సలు కంట్రోల్‌ చేసుకోలేకపోయింది. ఏకధాటిగా ఏడుస్తూనే ఉంది.

 

ఇంతకీ వీరిని హౌస్‌లోకి పంపిస్తాడా.? మన బిగ్‌బాస్‌ అంటే.. అందుకూ ఓ మెలిక ఉందండోయ్‌. వచ్చిన కుటుంబ సభ్యులకు కూడా ఓ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. వారి ముందు కొన్ని బాక్సులను ఉంచి, ఒక్కొక్కరూ ఒక్కో బాక్స్‌ తీసుకోవాలని సూచించాడు. వాటిలో ఐదు బాక్సుల్లో జోకర్‌నీ, ఐదు బాక్సుల్లో ఐ సింబల్‌ని ఉంచాడు. వాటిలో ఐ సింబల్‌ వచ్చిన ఐదుగురినీ ఓ గేమ్‌ ఆడించి వారిలో బెస్ట్‌ ఆఫ్‌ టూని ఎంచుకుని వారిని మాత్రమే హౌస్‌లోపలికి పంపించనున్నాడు. మరి ఆ గోల్డెన్‌ ఛాన్స్‌ ఎవరికి దక్కిందో చూడాలంటే స్టే ట్యూన్డ్‌.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS