'పెట్రోమాక్స్‌'లో తమన్నా మెరిసిపోతోందిగా.!

మరిన్ని వార్తలు

తెలుగులో తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన 'ఆనందోబ్రహ్మ' సినిమా తమిళంలో 'పెట్రోమాక్స్‌' టైటిల్‌తో రీమేక్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌ని తాజాగా విడుదల చేసింది చిత్రయూనిట్‌. ఒరిజినల్‌తో కంపేర్‌ చేస్తే, క్యారెక్ట్‌ర్స్‌ ఛేంజ్‌ తప్ప, సీన్స్‌లో పెద్దగా మార్పులు చేసినట్లు లేదు కానీ, తాప్సీతో పోల్చితే, తమన్నా బాగా ఎలివేట్‌ అవుతోంది. మంచి అభినయం ఉన్న డాన్సర్‌ కాబట్టి అక్కడ ఎక్కువ మార్కులు కొట్టేసింది తమన్నా.

 

అంతేకాదు, ప్రస్తుతం తమన్నా నటించిన 'సైరా' మూవీ రిలీజ్‌కి రెడీగా ఉంది. ఈ సినిమాలో తమన్నా 'లక్ష్మి' పాత్రలో నటిస్తోంది. ఈ పాత్ర తమన్నాకు కెరీర్‌ బెస్ట్‌ క్యారెక్టర్‌లా ప్రమోషన్స్‌ని బట్టి తెలుస్తోంది. ఈ గ్లోతో చూస్తూ, 'పెట్రొమాక్స్‌' ఆల్రెడీ అందరికీ తెలిసిన సబ్జెక్టే అయినా, కొత్తగా కనిపిస్తోంది.

 

తమిళ్‌ అయినా, తమన్నా కోసం ఈ చిత్రాన్ని మళ్లీ చూడాలనిపించేంతలా ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేస్తోంది. నిజంగా ఇది గుడ్‌ లక్కే తమన్నాకి. దెయ్యాల్ని చూసి మనుషులు భయపడతారు. కానీ, మనుషుల్ని చూసి దెయ్యాలే భయపడితే..? ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమానే 'పెట్రోమాక్స్‌'. తెలుగులో ఈ సినిమాని మహి.వి.రాఘవ తెరకెక్కించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS