'మిల్కీ' మేనియా మామూలుగా లేదండోయ్‌.!

By iQlikMovies - May 28, 2019 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

మిల్కీ బ్యూటీ తమన్నా స్టార్‌డమ్‌ అస్సలు తగ్గడం లేదు. స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొంది, మధ్యలో కాస్త డల్‌ అయినట్లు అనిపించినా, అవకాశాలు మాత్రం వరుసగా వస్తూనే ఉన్నాయి మిల్కీ బ్యూటీకి. అయితే, ఈ ఏడాది 'ఎఫ్‌ 2'తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకోవడంతో మిల్కీ బ్యూటీ క్రేజ్‌ మరింత పెరిగిపోయింది. 'ఎఫ్‌ 2' తర్వాత మిల్కీ బ్యూటీ నుండి వస్తోన్న సినిమా 'అభినేత్రి 2'.

 

లేటెస్ట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ వైరల్‌ చూస్తుంటే, మిల్కీ బ్యూటీ ఈ ఏడాది మరో సూపర్‌ హిట్‌కి రంగం సిద్ధం చేస్తోందన్నట్లే కనిపిస్తోంది. ట్రైలర్‌కి సోషల్‌ మీడియాలో బీభత్సమైన రెస్పాన్స్‌ వస్తోంది. ఇక ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ అందచందాలు కెవ్వు కేక అనిపిస్తున్నాయి. 'ఎఫ్‌ 2'లో హాట్‌ హాట్‌ బికినీల్లో రెచ్చిపోయి ఎక్స్‌పోజింగ్‌ చేసన తమన్నా, 'అభినేత్రి 2'లోనూ ఏం తక్కువ చేయడం లేదు.

 

జీరో సైజ్‌ అందాలతో బ్రైట్‌ స్కిన్‌ టోన్‌తో పొట్టి పొట్టి దుస్తుల్లో తెగ పిచ్చెక్కించేస్తోంది. 'అభినేత్రి 2'లో డబుల్‌ ఫన్‌తో పాటు, డబుల్‌ గ్లామర్‌ డోస్‌ కూడా ఎక్కువగానే ఉందనిపిస్తోంది. పదేళ్లకు పైగానే కెరీర్‌ ఉన్నప్పటికీ, ఇప్పుడు కూడా మిల్కీ బ్యూటీ తన గ్లామర్‌తో ఈ స్థాయిలో రెచ్చిపోతుండడం విశేషమే మరి. 'అభినేత్రి 2'తో పాటు ఈ ఏడాది మెగాస్టార్‌ ప్రతిష్ఠాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'తోనూ తమన్నా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీ 'దటీజ్‌ మహాలక్ష్మి'గానూ ఆడియన్స్‌కి తమన్నా దగ్గర కానుంది ఈ ఏడాదిలోనే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS