కైరాపై ఫైర్‌ అయిన కంగనా సోదరి!

మరిన్ని వార్తలు

కంగనా సోదరి రంగోలీ ఈ మధ్య తెగ పాపులర్‌ అయిపోయింది. సినిమాలతో ఈమెకు ఎలాంటి సంబంధాలు లేకపోయినా, ప్రతీ విషయంలోనూ స్పందిస్తూ, కొందరిపై విమర్శనాస్త్రాలు విసురుతూ, ఎప్పుడూ వార్తల్లో నిలవాలని చూస్తోంది. మొన్న 'మణికర్ణిక' విషయంలో దర్శకుడు క్రిష్‌పై మండిపడింది. తాజాగా ముద్దుగుమ్మ కైరా అద్వానీపై విరుచుకుపడింది. అసలు విషయమేంటంటే, కైరా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్‌ బిజీయెస్ట్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ బిజీగా గడుపుతోంది.

 

లేటెస్ట్‌గా 'ఇందూ కీ జవానీ' సినిమాలో కైరా ఛాన్స్‌ దక్కించుకుంది. ఈ సినిమాకి సంబంధించే రంగోలీ కైరాని తప్పు పట్టింది. ఇంకీ కైరాని తప్పు పట్టేంతగా ఈ సినిమాలో ఏముందా అంటే, డేటింగ్‌ యాప్స్‌లో నటించే అబ్బాయిల ప్రొఫైల్స్‌ ఎంపిక చేసుకుని, నచ్చిన వారితో డేటింగ్‌ చేయాలనుకునే క్యారెక్టర్‌లో కైరా నటిస్తోంది ఈ సినిమాలో. ఈ పాత్రను తప్పు పడుతూ, ఆమెపై దుర్భాషలు ఆడింది రంగోలీ.

 

మరి రంగోలా చేసిన కామెంట్స్‌పై కైరా స్పందిస్తుందా.? లేదా.? చూడాలిక. ఇక కాన్సెప్ట్‌ విషయానికి వస్తే, ఇంతకు మించి, వేస్య పాత్రల్లో కూడా గతంలో కొందరు హీరోయిన్లు నటించి మెప్పించారు. అప్పుడు రంగోలీ అంత యాక్టివ్‌గా లేనట్లుంది కాబోలు. కానీ, ఇప్పుడు ఈవిడగారు సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. అక్క కంగనా క్రేజ్‌తో తెగ విరుచుకుపడుతున్నారు. చూద్దాం కైరా, రంగోలీ కామెంట్స్‌ని సీరియస్‌గా తీసుకుంటుందా.? లైట్‌ తీసుకుంటుందా.?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS