రెండు ఫ్లాపులిచ్చినా.. త‌మ్మూనే ఫేవ‌రెట్

మరిన్ని వార్తలు

ఓటీటీల హవా మామూలుగా లేదు. వెబ్ సిరీస్‌లూ, వెబ్ మూవీస్, చాట్ షోలంటూ బోలెడంత ప‌ని క‌ల్పిస్తున్నాయి ఓటీటీలు. మ‌న స్టార్ల‌కు అయితే... భారీ పారితోషికాలు అందుతున్నాయి. దాంతో అటు సినిమా - ఇటు ఓటీటీ అంటూ రెండు వైపులా సంపాదించుకుంటున్నారు సెల‌బ్రెటీలు. ఓటీటీలో ఉన్న మ‌రో స‌దుపాయం... ఇక్క‌డ హిట్లూ, ఫ్లాపుల‌తో సంబంధం లేదు. అలా చేసుకుంటూ వెళ్లిపోవ‌డ‌మే. త‌మ‌న్నానే చూడండి. త‌న‌కు ఓటీటీలో భ‌లే క్రేజ్ ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కూ `లెవ‌న్త్ అవ‌ర్‌`, `న‌వంబ‌ర్ స్టోరీస్‌` అనే రెండు వెబ్ సిరీస్‌లు చేసింది. రెండూ ఫ్లాపులే. కానీ ఆమెకున్న డిమాండ్ త‌గ్గ‌లేదు.

 

తాజాగా అమేజాన్ త‌మ‌న్నాతో ఓ డీల్ కుదుర్చుకుంది. ఈ డీల్ లో భాగంగా త‌మ‌న్నా ఓ వెబ్ సిరీస్ చేయాలి. అందుకోసం భారీ మొత్తం పారితోషికం అందుకోబోతోంది. కేవ‌లం 6 నెల‌ల్లో ఈ వెబ్ సిరీస్ ప‌నులు పూర్త‌వుతాయి. అందుకోసం రెండు సినిమాలు స‌రిప‌డినంత పారితోషికం ద‌క్క‌బోతోంద‌ట‌. ఇది నిజంగా మంచి డీలే. తాను చేసిన రెండు వెబ్ సిరీస్‌లూ ఆద‌ర‌ణ పొంద‌క‌పోయినా - త‌మ‌న్నాకు ఇంకా అవ‌కాశాలు వ‌స్తున్నాయంటే, అడిగినంత పారితోష‌ఙ‌కం ఇవ్వ‌డానికి ఓటీటీ వేదిక‌లు రెడీ అయిపోయాయంటే... ఓటీటీ ఓ బంగారు నిధి అన్న సంగ‌తి అర్థ‌మ‌వుతూనే ఉంది. ఇక్క‌డ సంపాదించుకున్న‌వాళ్ల‌కు.. సంపాదించుకున్నంత‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS