ప్రియుడితో పెళ్ళికి సిద్దమైన తమన్నా

మరిన్ని వార్తలు

ఈ పెళ్లిళ్ల సీజన్ మొత్తం  సినీ పరిశ్రమదే అని చెప్పొచ్చు. అన్ని ఇండస్ట్రీలకి సంబంధించిన హీరో హీరోయిన్స్ పెళ్లి చేసుకుని పర్సనల్ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా ఈ సీజన్ లో హీరోయిన్స్ ఎక్కువ మంది పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు వివాహం చేసుకోగా ఇప్పుడు మరో హీరోయిన్ కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. ఆమె మరెవరో కాదు మిల్క్ బ్యూటీ తమన్నా.
 

తమన్నా 'శ్రీ' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. హ్యాపీ డేస్ తో వెనక్కి తిరిగి చూసుకోలేదు. తరవాత కోలీవుడ్, మాలీవుడ్ , బాలీవుడ్ లో కూడా నటించింది. ఇండస్ట్రీ కి వచ్చి 20 ఏళ్ళు అవుతున్న ఇప్పటికీ అవకాశాలు అందుకుంటూ తన కెరియర్  సక్సెస్ గా కొనసాగిస్తోంది. ఒక వైపు సినిమాలు ఇంకో వైపు వెబ్ సిరీస్ లు, ప్రత్యేక గీతాలతో అలరిస్తోంది. వయసు పై పడటంతో పెళ్లిపై మనసు మళ్లింది. తమన్నా గత కొంత కాలంగా బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ తో ప్రేమలో ఉంది. విజయ్ వర్మ తెలుగు ఆడియన్స్ కి కూడా పరిచయమే. నాని నటించిన MCA సినిమాలో విలన్ గా నటించాడు. వీరిద్దరూ కలిసి ఒక సినిమాకి వర్క్ చేస్తున్న టైం లో ఏర్పడిన పరిచయం, ప్రేమగా మారింది. ఇపుడు వీరిద్దరూ పెళ్లి చేసుకోవటానికి రెడీ అయ్యారు.


తమన్నా, విజయ్ కూడా అందరిలానే  డెస్టినేషన్ వెడ్డింగ్  ప్లాన్ చేస్తున్నట్టు  తెలుస్తోంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం వేదిక సెర్చ్ చేసే పనిలో ఉన్నారంట. అందుకోసం  లొకేషన్స్ వెతుకుతున్నట్లు టాక్.  లొకేషన్ ఫైనల్ అయితే అఫీషియల్ గా  మేరేజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారని సమాచారం. అన్ని కుదిరితే ఈ ఏప్రిల్ లో పెళ్లి పీటలెక్కనున్నారని తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS