లాక్ డౌన్ వల్ల షూటింగులు ఆగిపోయాయి. కొత్త కథలు వినడాలు, ఒప్పుకోవడాలూ, అడ్వాన్సులు తీసుకోవడాలూ లేవు. దాంతో కథానాయికలకు ఆదాయం లేకుండా పోయింది. సినిమాల్లేక పోయినా, షాపింగు మాల్స్‌లో సందడి చేయడం, అడ్వడైజ్‌మెంట్లతో నెట్టుకొచ్చేస్తుంటారు. ఇప్పుడు అవి కూడా లేకుండా పోయాయి. దాంతో... ఆదాయానికి గండి పడింది. ఇలాంటి లాక్ డౌన్ సమయంలోనూ తమన్నా బాగానే ఆర్జిస్తోంది. ఆహా కోసం ఓ టాక్ షో ఒప్పుకుంది తమన్నా. దీని ద్వారా కనీసం 2 నుంచి 3 కోట్లు సంపాదించబోతోంది. ఆహా కోసం తమన్నా ఓ టాక్ షో నిర్వహించబోతోంది.
ఈ టాక్ షోలో సినిమా సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేయబోతోంది. ఒక్కో ఎపిసోడ్ నుంచి 10 లక్షల వరకూ ఆదాయం ఆర్జించబోతోంది. దాంతో పాటు ఆహా కోసం కొన్ని ప్రమోషన్ ఈవెంట్లు కూడా నిర్వహించబోతోంది. దానికి కూడా తమన్నాకు భారీ ఎత్తున పారితోషికం కట్టబెట్టబోతోంది ఆహా. మొత్తానికి ఆహా ద్వారా కోట్లకు కోట్లు సంపాదించబోతోంది తమన్నా. లాక్ డౌన్ సమయంలో ఇంతకంటే మించిన ఆర్జన ఏముంటుంది?