మిల్కీ బ్యూటీ తమన్నా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా కనిపించదు. స్పెషల్ ఫోటో షూట్లకు అయితే చాలా దూరం. కానీ, లేటెస్ట్గా ఓ ఫోటో షూట్లో పాల్గొంది తమన్నా. ఈ ఫోటోలు ఇప్పుడు అంతర్జాలంలో చిందులేస్తున్నాయి. హాయిగా నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్న మిల్కీ బ్యూటీ అందాలకు ఎప్పటిలాగే ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నెటిజన్లు సరికొత్త కిక్ ఫీలవుతున్నారు. వైట్ అండ్ బ్లూ కలర్లో చెక్స్ బ్లేజర్ ధరించిన తమన్నా బేబీ పింక్‌లో ఇన్నర్ వేర్ ధరించింది. అసలే పాల మెరుపు స్కిన్. ఆ లైట్ బేబీ పింక్ ఆమె స్కిన్‌లో మిక్స్ అయిపోయి, డిఫరెంట్ గ్లామర్ లుక్ తీసుకొచ్చింది.
బ్లేజర్‌పై అక్కడక్కడా పొదిగిన పింక్ ఫ్లవర్స్ బ్లేజర్ లుక్‌ని ఇంకా ఎలివేట్ చేస్తున్నాయ్ . ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్, అప్పుడప్పుడూ మిల్కీ ఇలాంటి బ్యూటిఫుల్ అప్పియరెన్స్ కూడా ఇస్తే బావుంటుందని సహాలిస్తున్నారట. అసలే బిగ్ స్క్రీన్‌పై తన స్కిన్ తళుకులతో మెరిసిపోయే తమ్మూ డార్లింగ్ ఇలా సోషల్ మీడియానీ హీటెక్కించిందంటే, పాపం ఇదే పనిలో బిజీగా ఉన్న ఇతర సెబ్రిటీస్కి గండి కొట్టేసినట్లే అవుతుంది కదూ.