పవన్‌ సినిమాకి సర్‌ప్రైజింగ్‌ ‘గెస్ట్‌’ గ్లామర్‌.!

మరిన్ని వార్తలు

పవన్‌ కళ్యాణ్‌ ‘పింక్‌’ రీమేక్‌ సూపర్‌ ఫాస్ట్‌గా షూటింగ్‌ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ పవర్‌ స్టార్‌ తన షెడ్యూల్‌ పూర్తి చేసేశాడనే టాక్‌ ఉంది. ఇతర నటీనటులపై ప్రజెంట్‌ షూటింగ్‌ జరుగుతోందట. మేలో సినిమా రిలీజ్‌ కానుందనీ తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాకి సంబంధించి ఓ తాజా గాసిప్‌ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ఈ సినిమాలో స్పెషల్‌ గెస్ట్‌గా కనిపించనున్నారనీ తెలుస్తోంది. ‘పింక్‌’ ఒరిజినల్‌లో అమితాబ్‌ బచ్చన్‌ లీడ్‌ రోల్‌ పోషించిన సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్‌కొచ్చేసరికి పవన్‌ కోసం, లీడ్‌ రోల్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేశారట.

 

కథలో మార్పులకనుగుణంగా, ఒకానొక సీన్‌లో అమితాబ్‌ గెస్ట్‌ రోల్‌ని యాడ్‌ చేసినట్లు సమాచారం. అమితాబ్‌ బచ్చన్‌ అంటే పవన్‌కి చాలా చాలా ఇష్టం. ఇటీవల అన్నయ్య చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డిలో అమితాబ్‌ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్‌ జరుగుతున్న టైమ్‌లో అమితాబ్‌ని ఆన్‌సెట్స్‌లో గౌరవపూర్వకంగా కలిశారు పవన్‌ కళ్యాణ్‌. పవన్‌ రిక్వెస్ట్‌ చేయడంతో అమితాబ్‌ ఈ గెస్ట్‌ రోల్‌కి ఓకే చేసినట్లు తెలుస్తోంది. మరి, ఈ గాసిప్‌లో నిజమెంతో కానీ, ఈ సినిమాకి బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ నిర్మాణ భాగస్వామ్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. అలా బాలీవుడ్‌ పెద్దన్న బిగ్‌బీ అప్పియరెన్స్‌ కూడా తోడైతే, సినిమా రేంజ్‌ నెక్స్‌ట్‌ లెవల్‌కి చేరినట్లే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS